Priyanka Gandhi : కేరళ పర్యటన లో ఆవు పేరు తెలిసి ఆశ్చర్య పోయిన ప్రియాంకా గాంధీ
Priyanka Gandhi : ప్రియాంకా గాంధీ డెయిరీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మా పంచాయతీలోని ఈ ఫార్మ్ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో అనేక పురస్కారాలు అందుకుంది. 30 ఆవులతో, ఎలాంటి శాశ్వత కార్మికులు లేకుండా, కుటుంబ సభ్యులే నిర్వహిస్తున్న ఈ ఫార్మ్‌ను ఆమె దగ్గరగా తెలుసుకోవాలనుకున్నారు
- By Sudheer Published Date - 03:15 PM, Fri - 10 October 25
 
                        కేరళలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) పర్యటించారు. వయనాడ్ నియోజకవర్గంలో ఉన్న కోడెంచెరి డెయిరీ ఫామ్ ను ఆమె సందర్శించగా, అక్కడ ఉన్న ఓ ఆవు పేరు ఆలియా భట్ (Cow named Alia Bhatt)అని తెలిసి అందరి దృష్టి ఆవుపైనే నిలిచిపోయింది. రైతు మాథ్యూ మరియు ఫాదర్ ఆగస్టిన్ ఆ ఆవుకు ఆ పేరు పెట్టారని సమాచారం. ఈ ఫార్మ్‌ను శీబా ఫ్రాన్సిస్ నిర్వహిస్తుండగా, జిను థామస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రియాంకా గాంధీ పర్యటనతో ఈ ఫార్మ్ రాష్ట్రవ్యాప్తంగా ఆకర్షణగా మారింది.
ఫార్మ్ యజమానులు మీడియాతో మాట్లాడుతూ.. “ప్రియాంకా గాంధీ మా ఫార్మ్‌కి వచ్చినప్పుడు మేము ఎంతో సంతోషించాం. ఆమె సుమారు గంటసేపు ఫార్మ్‌లో గడిపి ప్రతి ఆవుకీ స్వయంగా మేత పెట్టారు. ఆవుల పేర్లు కూడా అడిగి తెలుసుకున్నారు. ‘ఆలియా భట్’* అనే పేరును విని నవ్వుతూ ప్రత్యేకంగా ఆ ఆవును పలకరించారు. అంతేకాకుండా నెలరోజుల పసి దూడకు ఆమె ‘మారియా’ అని పేరు పెట్టమని సూచించారు. దానిని ఆమెలా మేము మార్చి పెట్టాం,” అని శీబా ఫ్రాన్సిస్ తెలిపారు. ఆమె ప్రియాంకా గాంధీ దూడను ముద్దాడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Gold Price : ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
“ప్రియాంకా గాంధీ డెయిరీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మా పంచాయతీలోని ఈ ఫార్మ్ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో అనేక పురస్కారాలు అందుకుంది. 30 ఆవులతో, ఎలాంటి శాశ్వత కార్మికులు లేకుండా, కుటుంబ సభ్యులే నిర్వహిస్తున్న ఈ ఫార్మ్‌ను ఆమె దగ్గరగా తెలుసుకోవాలనుకున్నారు,” అన్నారు. పర్యటన సందర్భంగా ప్రియాంకా గాంధీ రైతులతో మాట్లాడి, పాలు ఉత్పత్తిదారుల సమస్యలను విన్నారు. పశువైద్య మందుల ధరల పెరుగుదల, బీమా రక్షణ లోపం, గుణాత్మకమైన మేత అందుబాటులో లేకపోవడం వంటి అంశాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తానని, రైతులకు సహాయం అందించే దిశగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. “రైతుల సహనం, కష్టపడే తత్వం నన్ను ఎంతో ప్రభావితం చేసింది” అని ప్రియాంకా గాంధీ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
 
                    



