TVK : విజయ్ రాజకీయ ప్రస్థానంపై పవన్ కల్యాణ్ రియాక్షన్
Thalapathy Vijay : "సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో తన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన శ్రీ విజయ్ గారికి నా హృదయపూర్వక శుభాభినందనలు"
- By Sudheer Published Date - 03:54 PM, Mon - 28 October 24
తమిళ వెట్రి కజగం పార్టీ (TVK) పార్టీ అధినేత, సినీ నటుడు దళపతి విజయ్(Thalapathy Vijay) కి ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ కంగ్రాట్స్ తెలిపారు. తమిళ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగమ్ (TVK) పార్టీ ద్వారా రాజకీయ సమరంలో అడుగుపెట్టారు.
ఆదివారం తమిళనాడు విల్లుపురం (Villupuram) జిల్లాలోని విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) మహానాడు సభను ఏర్పాటు చేసి పార్టీ సిద్ధాంతాలు , పార్టీ నియమాలు , పార్టీ పోటీ చేసే స్థానాలు తదితర విషయాలు తెలిపి తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. బీజేపీతో సిద్ధాంతపరంగా విభేదాలను వ్యక్తం చేసి, డీఎంకేని రాజకీయ ప్రత్యర్థిగా అంగీకరించారు. అలాగే మద్దతు ఇచ్చే పార్టీలతో కలిసి నడుస్తానని , ఇప్పుడే పొత్తుల గురించి ప్రస్తావించానని క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలో విజయ్ రాజకీయ ప్రస్థానంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. “సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో తన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన శ్రీ విజయ్ గారికి నా హృదయపూర్వక శుభాభినందనలు” అంటూ విషెస్ తెలియజేశారు. పవన్ కల్యాణ్ సైతం ఇదే రీతిలో సినీ రంగం నుంచి వచ్చి పార్టీ పెట్టి..దాదాపు 10 ఏళ్ల పాటు ఎలాంటి అధికారం లేనప్పటికీ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ..వారికీ తనవంతు సాయం చేస్తూ..నేడు కూటమి ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఎదిగారు.
Read Also : Maharashtra : మహారాష్ట్ర ఎన్నికలు.. సీఎం ఏకనాథ్ షిండే నామినేషన్ దాఖలు