భారత్ ను అమ్మడానికి మోడీ అమెరికా.. సీపీఎం నేత కారత్ సంచలన వ్యాఖ్యలు
భారత ప్రధాని మోడీ విదేశీ పర్యటనల వెనుక రహస్య ఎజెండా ఉందట. దేశాన్ని అమ్మేయడానికి విదేశాలకు వెళతాడని కమ్యూనిస్ట్ ల భావన. పలు సందర్భాల్లో విదేశాలకు వెళ్లిన మోడీ చేసుకున్న ఒప్పందాల గురించి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శ ప్రకాష్ కారత్ గుర్తు చేశారు.
- By Hashtag U Published Date - 10:51 AM, Fri - 24 September 21

భారత ప్రధాని మోడీ విదేశీ పర్యటనల వెనుక రహస్య ఎజెండా ఉందట. దేశాన్ని అమ్మేయడానికి విదేశాలకు వెళతాడని కమ్యూనిస్ట్ ల భావన. పలు సందర్భాల్లో విదేశాలకు వెళ్లిన మోడీ చేసుకున్న ఒప్పందాల గురించి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శ ప్రకాష్ కారత్ గుర్తు చేశారు. ప్రస్తుత అమెరికా పర్యటన కూడా దేశంలోని సంపదను ఇతరులకు అమ్మేయడానికి మాత్రమేనని ఇందిరా పార్కు వద్ద జరిగిన మహాధర్నాలో ఆరోపించడం చర్చనీయాంశం అయింది.
మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు. దాదాపుగా ఏడాదిన్నర తరువాత జరుగుతున్న విదేశీ పర్యటన ఇది. టెక్నాలజీ, డ్రోన్స్ సాంకేతికతకు సంబంధించిన. ఒప్పందాలు అమెరికాతో చేసుకుబోతున్నారు. ఐక్యరాజ్య సమితి వేదికగా ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ల వ్యవహారంపై మోడీ మాట్లాడతారు. ఇదంతా అధికారికంగా ప్రభుత్వం వెల్లడించిన ఎజెండా.
భారత ప్రధానిగా భాద్యతలు స్వీకరించిన తరువాత పలు దేశాల్లో నరేంద్ర మోడీ పర్యటించారు. రక్షణకు సంబంధించిన పలు ఒప్పందాలు చేసుకున్నారు. అవే, ప్రపంచ వ్యాప్తంగా వివాదస్పదం అయ్యాయి. రాఫిల్ కుంభకోణంపై పార్లమెంట్ వేదికగానే కాకుండా బయట కూడా దుమారం రేగింది. సరిహద్దు దేశాలతో చేసుకున్న ఒప్పందాలు అనేకం రాజకీయ ఆరోపణలకు దారితీశాయి.
ప్రస్తుతం దేశంలోని పబ్లిక్ రంగ సంస్థలను విక్రయించడానికి మోడీ ప్రభుత్వం వేగంగా ముందుకు కదులుతోంది. సుమారు 6లక్షల కోట్ల రూపాయాలను సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఎల్ ఐసీ, ఎయిర్ ఇండియ, హెసీఎల్, ఐడీపీ , విశాఖ స్టీల్ తదితర సంస్థల్ని ప్ర్రైవేటుకు అమ్మేయాలని రెడీ అయింది. విదేశీ పెట్టుబడులను వివిధ రంగాల్లో 100శాతం ఆహ్వానించింది. ఫలితంగా దేశ సంపదను విదేశీ కంపెనీలు దోచుకుంటాయని కమ్యూనిస్ట్‌ల వాదన.
మోడీ అమెరికా పర్యటనలో కూడా ఏదో అమ్మకానికి తెరలేపుతారని ప్రకాష్ కారత్ భావన. మోడీ వ్యవహార శైలి మీద ఇందిరాపార్కు వద్ద కారత్ దుమ్మెత్తి పోశారు. రాబోయే రోజుల్లో మోడీని గద్దె దించకపోతే, భారత సంపద మొత్తం విదేశీ కంపెనీల పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే రాజకీయ పార్టీలన్నీ ఒక వేదిక మీదకు వచ్చి మోడీని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
మొత్తం 19 పార్టీలతో కలిసి ఇందిరా పార్కు వద్ద మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మహాధర్నాను నిర్వహించారు. ధర్నాలో సీపీఐ జాతీయ కార్యదర్శ నారాయణ, సీపీఎం ప్రధాన కార్యదర్శ కారత్ పాల్గొన్నారు. టీడీపీతో సహా కాంగ్రెస్ పార్టీతో 19 పార్టీలు జతకట్టాయి. ఇదంతా రేవంత్ వేసిన ఎత్తుగడగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ, జాతీయ స్థాయిలో ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీయేతర పార్టీలతో కలిసి పోరాడేందుకు కాంగ్రెస్ పిలుపు నిచ్చింది. ఆ క్రమంలో జరిగిన మహాధర్నాలోని హైలెట్ గా కారత్ నిలువగా రేవంత్ లీడింగ్ లీడర్ గా కనిపించారు. ఏదేమైనా మోడీ , కేసీఆర్ టార్గెట్ గా చేసిన ధర్నా భవిష్యత్ రాజకీయ కూటమికి సంకేతాలను ఇచ్చింది.
Related News

అమెరికా టాప్ 5 కంపెనీలపై మోఢీ .. టెక్నాలజీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
అమెరికాలోని టాప్ 5 కంపెనీల సీఈవోలతో భారత ప్రధాని నరేంద్రమోడీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. టాప్ 5 కంపెనీల సీఈవోలలో ఇద్దరు ఇండియన్ మూలాలు ఉన్న సీఈవోలు కావడం విశేషం.