CM Stalin: హిందీలాగే తమిళాన్నీ అధికార భాషగా ప్రకటించండి.. సభా వేదికపై మోడీకి స్టాలిన్ విజ్ఞప్తి
హిందీలాగే తమిళాన్ని కూడా దేశ అధికార భాషగా ప్రకటించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.
- By Hashtag U Published Date - 08:32 PM, Thu - 26 May 22

హిందీలాగే తమిళాన్ని కూడా దేశ అధికార భాషగా ప్రకటించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. రూ.28వేల కోట్లు విలువైన 6 అభివృద్ధి పనుల ప్రాజెక్టులను ప్రారంభించేందుకు చెన్నై కు వచ్చిన ప్రధానికి ఈమేరకు స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఇద్దరూ కలిసి గురువారం వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఒకేచోట ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోదీ ఎదుటే.. తమిళ భాషకు అధికార హోదా ఇవ్వాలనే డిమాండ్ ను స్టాలిన్ లేవనెత్తారు. ఈ కార్యక్రమాల సందర్భంగా బీజేపీ, డీఎంకే శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేశాయి. బీజేపీ శ్రేణులు “లాంగ్ లివ్ మోడీ” అని నినాదాలు చేయగా.. డీఎంకే శ్రేణులు సీఎం స్టాలిన్ ను పొగుడుతూ “లాంగ్ లివ్ అవర్ కామ్రేడ్ విత్ గోల్డెన్ హర్ట్” అని స్లోగన్స్ ఇచ్చారు.
Live: தேசிய நெடுஞ்சாலைத் திட்டங்கள் மற்றும் இரயில்வே திட்டங்களுக்கு அடிக்கல் நாட்டும் விழாவில் உரை https://t.co/OPXCXQHHj0
— M.K.Stalin (@mkstalin) May 26, 2022