TN: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన మద్యం ధరలు
తమిళనాడులో మద్యం ధరలు భారీగా పెరిగాయి. 180 ఎంఎల్ బాటిల్‌పై రూ.10, 375 ఎంఎల్ మద్యం బాటిల్‌పై రూ.20 పెరిగింది.
- By Hashtag U Published Date - 08:15 AM, Mon - 7 March 22

తమిళనాడులో మద్యం ధరలు భారీగా పెరిగాయి. 180 ఎంఎల్ బాటిల్‌పై రూ.10, 375 ఎంఎల్ మద్యం బాటిల్‌పై రూ.20 పెరిగింది. ధరల పెరుగుదల సోమవారం, మార్చి 7 నుండి అమలులోకి వస్తుంది. మార్చి 5 శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్) పేరుతో రాష్ట్ర బ్యానర్ కింద తమిళనాడులో మద్యం విక్రయిస్తారు. గతంలో మే 2020లో మద్యం ధరలు పెరిగాయి. తమిళనాడులో మే 7 నుంచి మద్యం ధరలను గరిష్టంగా రూ.20 పెంచారు. ఆ తరువాత మళ్లీ మద్యం ధరలు ఇప్పుడు పెరిగాయి. దీంతో మద్యం ప్రియులు నిరాశతో ఉన్నారు.