Leopard Cub Rescued: తమిళనాడులో చిరుతపులి పిల్లని రక్షించిన కార్మికులు
తమిళనాడులోని పూలంపాటి ప్రాంతంలో తేయాకు తోటలో పని చేసే కార్మికులు చిరుతపులి పిల్లని రక్షించారు.
- By Hashtag U Published Date - 08:09 AM, Wed - 27 April 22

తమిళనాడులోని పూలంపాటి ప్రాంతంలో తేయాకు తోటలో పని చేసే కార్మికులు చిరుతపులి పిల్లని రక్షించారు. పూలంపాటి ప్రాంతానికి సమీపంలోని శ్రీమదురై వద్ద టీ ప్లాంట్ల వద్ద ఈ ఘటన జరిగింది. ప్రవేట్ టీ ప్లాంటేషన్ కంపెనీలో పనిచేస్తున్న కొందరు కార్మికులు టీ ప్లాంట్లలో చిరుతపులి ఏడుస్తున్న శబ్ధం వినిపించడంతో అక్కడి వెళ్లి చూశారు.
తల్లికి దూరంగా ఒంటరిగా ఉన్న చిరుతపులి పిల్ల కనిపించడంతో షాక్‌కు గురైన వారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు వచ్చి చిరుతపులి పిల్లని రక్షించేంత వరకు కూలీలు పిల్లతోనే ఉన్నారు. ఆ పిల్లకు కేవలం వారాల వయస్సు మాత్రమే ఉందని, తల్లి వద్దకు వెళ్లి ఉండాల్సిందని అధికారులు పేర్కొన్నారు. తల్లి తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున పిల్లవాడిని ఆ ప్రాంతం నుండి తరలించవద్దని వారు చెప్పారు. చిరుతపులి పిల్లని తిరిగి తల్లి వద్దకు చేర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు తెలిపారు.