Kushboo Sundar: బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ
Kushboo Sundar: ఖుష్బూ సుందర్ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా, బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా కూడా కొనసాగుతున్నారు. ఈ కొత్త నియామకంతో ఆమెకు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలపై మరింత ప్రత్యక్ష బాధ్యత అప్పగించినట్లయింది
- By Sudheer Published Date - 10:14 AM, Thu - 31 July 25

ప్రముఖ సినీ నటి, భారతీయ జనతా పార్టీ (BJP) నాయకురాలు ఖుష్బూ సుందర్(Kushboo Sundar)కు పార్టీలో అత్యంత కీలకమైన పదవి లభించింది. ఆమెను తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా(Tamil Nadu BJP State Vice President) నియమించారు. ఈ నియామకం పార్టీలో ఆమె ప్రాధాన్యతను మరింత పెంచిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో ఈ కొత్త రాష్ట్ర వర్గాన్ని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు.
Highway : హైవేపై సడెన్ బ్రేక్ వేస్తున్నారా..? అయితే మీరు నేర చేసినట్లే !!
కొత్తగా నియమితులైన రాష్ట్ర ఉపాధ్యక్షుల జాబితాలో మొత్తం 14 మంది సభ్యులు ఉండగా, అందులో ఖుష్బూ సుందర్ ఒకరు. ఇది తమిళనాడులో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, సినీ గ్లామర్‌ను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఖుష్బూకు ఉన్న ప్రజాదరణ, ఆమె వాక్చాతుర్యం పార్టీకి కలిసొచ్చే అంశాలని పలువురు పేర్కొంటున్నారు.
నయనార్ నాగేంద్రన్ తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఈ నూతన కమిటీ వివరాలను పంచుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులతో పాటు, ఐదుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, 14 మంది రాష్ట్ర కార్యదర్శులతో కూడిన జాబితాను కూడా ఆయన విడుదల చేశారు. ఈ నియామకాలు తమిళనాడులో బీజేపీ వ్యూహంలో భాగమని, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Kingdom Talk : విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ పబ్లిక్ టాక్
కాగా ఖుష్బూ సుందర్ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా, బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా కూడా కొనసాగుతున్నారు. ఈ కొత్త నియామకంతో ఆమెకు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలపై మరింత ప్రత్యక్ష బాధ్యత అప్పగించినట్లయింది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు దీటుగా బీజేపీ ఎదగడానికి ఖుష్బూ వంటి ప్రముఖుల సేవలను ఉపయోగించుకోవాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.