HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Keralas Kattunayakan Tribe Gets Its First Btech Graduate

Tribal Girl: క‌ట్టునాయ‌కన్ తెగ నుంచి బీటెక్ పూర్తి చేసిన మొద‌టి మ‌హిళ ఈమె…!

కేర‌ళ రాష్ట్రంలో క‌ట్టునాయ‌క‌న్‌ తెగ నుంచి బిటెక్ ప‌ట్టా పొందిన మొద‌టి వ్య‌క్తిగా శృతిరాజ్ నిలిచింది. క‌ట్టికుళంలోని చేలూర్ లో నేతాజీ గిరిజ‌న కాల‌నీకి చెందిన ఆమె త‌న ప‌ట్టుద‌ల‌తో బిటెక్ చ‌దివింది.శృతిరాజ్ దీనికోసం ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌లు ప‌డింది.

  • By Hashtag U Published Date - 10:59 PM, Sat - 4 December 21
  • daily-hunt
Whatsapp Image 2021 12 04 At 20.42.10 Imresizer
kerala tribal girl

కేర‌ళ రాష్ట్రంలో క‌ట్టునాయ‌క‌న్‌ తెగ నుంచి బిటెక్ ప‌ట్టా పొందిన మొద‌టి వ్య‌క్తిగా శృతిరాజ్ నిలిచింది. క‌ట్టికుళంలోని చేలూర్ లో నేతాజీ గిరిజ‌న కాల‌నీకి చెందిన ఆమె త‌న ప‌ట్టుద‌ల‌తో బిటెక్ చ‌దివింది.శృతిరాజ్ దీనికోసం ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌లు ప‌డింది.
శృతి రాజ్ త‌ల్లిదండ్రులు పేరు రాజు-సునీత.వీరిద్ద‌రు రోజువారీ కూలీ చేసుకుంటూ జీవితం గ‌డుపుతున్నారు.

ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల్లో 86 శాతం మార్కులు సాధించిన శృతిరాజ్‌.. ఉన్న‌త చ‌దువులు చ‌దివేందుకు ఆమెకు ప‌లువురు చేయూత నిచ్చారు. ఆమె కత్తికుళంలోని ప్రభుత్వ హెచ్‌ఎస్‌ఎస్‌లో 10వ తరగతి వరకు చదివింది… మనంతవాడిలోని ప్రభుత్వ ఒకేషనల్ హెచ్‌ఎస్‌ఎస్‌లో ప్లస్ టూ చదివింది. 2014-18లో వాయనాడ్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్‌లో బీటెక్ కోర్సులో చేరింది. బిటెక్ లోఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మైక్రోప్రాసెసర్ & కంట్రోలర్ పేపర్‌ను క్లియర్ చేయాల్సి వచ్చింది. త‌న‌ మొదటి రెండు ప్రయత్నాల్లో విఫల‌మైంది. ఆమె మూడవ ప్రయత్నంలో సబ్జెక్ట్‌ను క్లియర్ చేసింది. 60 శాతం మార్కులతో బీటెక్‌ పూర్తి చేసిన శృతిరాజ్‌…త‌న క‌మ్యూనిటీలో చాలా మంది విద్యార్థులు చ‌దువును ఆపేసిన‌ప్ప‌టికీ తాను మాత్రం బీటెక్ పూర్తి చేసి త‌న ఘ‌న‌త‌ని సాధించింది. బిటెక్ అనంత‌రం ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది . ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతోంది.

కట్టునాయకన్ తెగ ప్రధానంగా వయనాడ్, నిలంబూర్ మరియు పాలక్కాడ్ అటవీ ప్రాంతాలలో విస్తరించి ఉందని వాయనాడ్‌లోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం యొక్క జిల్లా ప్రాజెక్ట్ అధికారి కె సి చెరియన్ తెలిపారు. ఇప్పటివరకు ఆ క‌మ్యూనిటీలో బీటెక్‌ కోర్సు పూర్తి చేసిన ఏ విద్యార్థి గురించి మాకు సమాచారం అందలేదని…ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి శృతిరాజ్ గా నిలిచింద‌న్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BTech course
  • Chelur in Kattikulam
  • Kattunayakan tribe
  • Kerala's Kattunayakan tribe
  • Sruthi Raj

Related News

    Latest News

    • Hyundai Venue N Line: హ్యుందాయ్ వెన్యూ N లైన్‌.. భారత మార్కెట్లోకి కొత్త ఎడిషన్!

    • Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్-నయనిక నిశ్చితార్థం.. మెగా ఫ్యామిలీ సందడి!

    • Men Get Romantic: రాత్రి 12 దాటితే మగవారి మనసు ఎందుకు మారుతుంది?

    • IND vs AUS: మెల్‌బోర్న్‌లో భారత్‌ ఘోర పరాజయం.. కార‌ణాలివే?

    • H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

    Trending News

      • 5 Star Hotel: ఇక‌పై టాయిలెట్ వ‌స్తే.. 5 స్టార్ హోట‌ల్‌కు అయినా వెళ్లొచ్చు!

      • Bank Holidays: బ్యాంకు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. మొత్తం 10 రోజుల సెల‌వులు!

      • Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్ల‌నున్నాడా? అస‌లు నిజం ఇదే!

      • Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధ‌ర‌కు రెక్క‌లు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!

      • Traffic Challan Cancellation: మీరు ఏదైనా వాహ‌నం న‌డుపుతున్నారా? అయితే ఈ ట్రాఫిక్ రూల్ తెలుసుకోవాల్సిందే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd