KCR and Stalin: గంట సేపు మాట్లాడుకున్న కేసీఆర్ స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు గంట పాటు సమావేశం ఆయ్యారు.
- By Siddartha Kallepelly Published Date - 12:08 AM, Wed - 15 December 21

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు గంట పాటు సమావేశం ఆయ్యారు. సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి మార్చి 28న యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవనికి రావాలని స్టాలిన్ కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. అనంతరం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాదాపు నలభై నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారని సమాచారం.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు రాజకీయ పరమైన అంశాలపై చర్చించారట.
ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలోనే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారు. గత పర్యటనలో కరుణానిధితో ఈ విషయాన్ని చర్చించిన కేసీఆర్ తాజాగా స్టాలిన్ తోనూ థర్డ్ ఫ్రంట్ రూపకల్పనపై మాట్లాడినట్టు సమాచారం. రెండు జాతీయ పార్టీలు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశాయని, దానిపై పోరాటం చేయాలని, ఆ పోరాటానికి ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని స్టాలిన్ కేసీఆర్ ఒక కంక్లూజన్ కి వచ్చినట్టు తెలుస్తోంది.
దేశంలో నీటి వనరులు వాడుకోవడానికి ఉన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రాలను వాడుకోనివ్వడం లేదని కావేరి, కృష్ణా జలాలపై కేంద్రం తేల్చడం లేదని, ప్రాంతీయ పార్టీల తోనే రాష్ట్రాల మధ్య ఎలాంటి తగాదాలు లేకుండా ముందుకు వెళ్లొచ్చన్న అభిప్రాయాన్ని ఇద్దరు సీఎంలు వ్యక్తం చేశారట.
కేంద్రం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టించుకోవడంలేదని ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలు తమ అసహనం వ్యక్తం చేశారట.
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చి చట్టాలను వెనక్కి తీసుకుందని,అదే విధంగా విద్యుత్ బిల్ పై ముందుకు వెళ్లి రైతులకు ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తోందని, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేంద్ర నిర్ణయాలను తిప్పికొట్టాలని చర్చించుకున్నట్లు సమాచారం.
బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కేంద్రంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగించాలని, కేంద్రం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటానికి ప్రాంతీయ పార్టీలని ఎలా ఏకం చేయాలన్నదానిపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారట.