Halal Ban in Karnataka : కర్ణాటకలో హలాల్ మాంసం నిషేధం?
హిజాబ్ వివాదంతో తల్లడిల్లిపోయిన కర్ణాటక రాష్ట్రాన్ని ఇప్పుడు హలాల్ మాసం వెంటాడుతోంది. ఆ మాంసం విక్రయాలను నిలిపివేయాలని కొన్ని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వద్దకు కొన్ని అభ్యంతరాలను తీసుకొచ్చాయి. ఆ విషయాన్ని కర్ణాటక సీఎం బొమ్మై వెల్లడించాడు.
- By CS Rao Published Date - 04:59 PM, Thu - 31 March 22

హిజాబ్ వివాదంతో తల్లడిల్లిపోయిన కర్ణాటక రాష్ట్రాన్ని ఇప్పుడు హలాల్ మాసం వెంటాడుతోంది. ఆ మాంసం విక్రయాలను నిలిపివేయాలని కొన్ని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వద్దకు కొన్ని అభ్యంతరాలను తీసుకొచ్చాయి. ఆ విషయాన్ని కర్ణాటక సీఎం బొమ్మై వెల్లడించాడు. హిందువుల నుంచి వస్తోన్న అభ్యంతరాలను పరిశీలిస్తున్నామని ప్రకటించాడు.కర్ణాటక ప్రభుత్వం హలాల్ మాంసం విక్రయాలపై నిషేధం విధించడానికి సిద్ధం అవుతోంది. “హలాల్ సమస్య ఇప్పుడే మొదలైంది. దానిని అధ్యయనం చేయాలి. ఇప్పుడు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నేను పరిశీలిస్తాను’ అని సీఎం బొమ్మై మీడియాకు తెలిపాడు. కొన్ని మితవాద సంస్థలు హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని పిలుపునివ్వడం కర్ణాటకలో తాజా వివాదంగా మారింది. ఆ విషయాన్ని బొమ్మై దృష్టికి తీసుకెళ్లినప్పుడు రైట్ వింగ్, లెఫ్ట్‌వింగ్ కు భిన్నంగా గ్రోత్ వింగ్ తో కర్ణాటక సర్కార్ వెళుతోందని వివరించాడు. కానీ, విపక్షాలు మాత్రం బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి అంశాలను తెరపైకి తెచ్చిందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.కర్ణాటకను ఉత్తరప్రదేశ్‌గా మార్చాలని బీజేపీ కోరుకుంటోందని కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే ఆరోపించాడు.కాశ్మీర్ ఫైల్స్, మైనారిటీల ఆర్థిక కార్యకలాపాలపై నిషేధం ఇప్పుడు హలాల్ మాంసం వంటి సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బీజేపీ ఎత్తుగడ వేస్తోందని విమర్శించాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దినేష్ గుండూరావు మాట్లాడుతూ హిజాబ్ , దేవాలయాల జాతరలలో ముస్లిం విక్రయదారులపై “నిషేధం” గురించి ప్రస్తావించారు. బాలికల విద్య వంటి వాస్తవ సమస్యలను విస్మరించారని అన్నారు. హలాల్ మాంసం విక్రయాల నిషేధంపై పరిశీలిస్తున్నామని సీఎం బొమ్మై చెప్పడాన్ని ఆయన ఖండించాడు.