Karnataka BJP : కర్ణాటక బీజేపీలో మాజీ సీఎం యడుయూరప్ప కలకలం
మాజీ సీఎం యడుయూరప్పను(Karnataka BJP) బీజేపీ సైడ్ చేస్తోంది. మోడీ పాల్గొంటోన్న ప్రోగ్రామ్ లకు కూడా దూరంగా పెడుతున్నారు
- Author : CS Rao
Date : 12-01-2023 - 5:40 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ సీఎం యడుయూరప్పను(Karnataka BJP) వ్యూహాత్మకంగా బీజేపీ సైడ్ చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటోన్న ప్రోగ్రామ్ లకు కూడా దూరంగా పెడుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం కుదరదని సున్నితంగా యడ్డీని దూరం చేస్తున్నారు. హుబ్బలిలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ(Modi) జాతీయ యువజనోత్సవ కార్యక్రమం అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది. ఈ పరిణామం కర్ణాటక రాజకీయాల్లో(Karnataka BJP) చర్చనీయాంశంగా మారింది.కర్ణాటక బీజేపీకి బలమైన నేత బీఎస్ యడియూరప్ప ఉన్నారు. ఆయన్ను కాదని బీజేపీ ఈ సారి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోందని టాక్. ఇదే విషయమై పలు రకాలుగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి మాజీ ముఖ్యమంత్రిని ఆహ్వానించలేదని బీజేపీ పార్టీ చెబుతోంది. అంతేకాదు, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ కూడా ఆహ్వానం పంపలేదని బీజేపీ కర్ణాటక విభాగం గుర్తు చేస్తోంది.
కర్ణాటక రాజకీయాల్లో(Karnataka BJP)..
హుబ్బలిలోని రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ ఈ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఇందులో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అనురాగ్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ప్రధాని న్యూఢిల్లీకి వెళ్లేలా షెడ్యూల్ ఉంది. ఆ కార్యక్రమానికి యడ్డీకి ఆహ్వానం లభించకపోవడం ఆయన వర్గీయుల్లో కలవరం మొదలైయింది.
Also Read : Karnataka Government Invited Jr.NTR: కర్ణాటక అసెంబ్లీకి జూనియర్!
యాదృచ్ఛికంగా, యడ్యూరప్ప ఇటీవల మాండ్యాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్టీ కార్యక్రమంలో కనిపించలేదు. ఆ రోజు ఆయన విదేశాలలో ఉన్నారు. దీంతో బీజేపీ వేదికను ఆయన పంచుకోలేకపోయారు. ఈపరిణామాలన్నీ గమనిస్తోన్న క్యాడర్ మాత్రం యడ్డీని పార్టీ నిర్లక్ష్యం చేస్తుందని భావిస్తోంది. ఆ విషయాన్ని యడియూరప్ప పదేపదే కొట్టిపారేశారు. సొంత బలం ఉందని, ఎవరూ రాజకీయంగా అంతం చేయలేరని చెబుతూ సొంత వర్గానికి సర్దిచెబుతున్నారు.
స్పోర్ట్స్ ఫెస్టివల్ ఈవెంటను..
జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైన యువతను పరిచయం చేయడంతో పాటు దేశ నిర్మాణం వైపు వారిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ ఫెస్టివల్ ఈవెంటను కర్ణాటక కేంద్రంగా నిర్వహిస్తారు. ప్రధానమంత్రి తన విజన్‌ను వారితో పంచుకునే ప్రారంభ కార్యక్రమం అది. సుమారు 30వేల మందికి పైగా యువత హాజరవుతారని ఏర్పాట్లు బారీగా చేశారు. ఐదు రోజుల పాటు జరిగే ఈవెంట్ కు భారతదేశం నలుమూలల నుండి 7,500 మంది యువ ప్రతినిధులు వివిధ ఈవెంట్స్ లో పాల్గొనే అతి పెద్ద పండగ. దీన్ని అధికారికంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పొడచూపిన రాజకీయ విభేదాలు యడ్డీ వైపు మళ్లాయి.
Also Read : Karnataka Farmers : తెలంగాణ పథకాలే మాకు ఇవ్వండి.. ప్రభుత్వానికి కర్ణాటక రైతుల డిమాండ్