2020 మాకు మాత్రం అద్భుతాన్నిచ్చింది!
కరోనా మహమ్మారి దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని సైతం వణికిచింది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ భయపెట్టింది. ఎంతోమందికి చేదు అనుభవాలను పంచింది.
- By Balu J Published Date - 10:00 AM, Sun - 24 October 21

కరోనా మహమ్మారి దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని సైతం వణికిచింది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ భయపెట్టింది. ఎంతోమందికి చేదు అనుభవాలను పంచింది. మరెందరినో కోలుకోకుండా చేసింది. కానీ 2020 ఇయర్ మాకు మాత్రమే అద్భుతాన్ని అందించింది అని అంటోది హీరోయిన్ శ్రియ శరన్. ఈమె వ్యాపారవేత్త అయిన ఆండ్రీ కోస్చీవ్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా సమయంలో ఆమె, భర్త ఆండ్రీ విదేశాల్లో ఉండిపోయారు.
రెండేళ్లు విదేశాల్లో ఉన్న శ్రియ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తన ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టకపోవడం గమనార్హం. ఇక గతేడాది వెకేషన్ నిమిత్తం బోర్సిలోనాకు వెళ్లిన శ్రియ దంపతులు లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. విదేశాల నుంచి వచ్చిన శ్రియ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. పాపకు రాధ అనే పేరు పెట్టారు. రష్యన్ భాషలో రాధ అంటే సంతోషం అనే అర్థముందట. దాంతో పాపకు ఆ పేరు పెట్టాము అని శ్రియ చెప్పింది. ఆమె రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
తెలుగు తెరతో పాటు సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో ఓ ఊపు ఊపేసిన శ్రియ.. స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. అందం, అందుకు తగ్గ అభినయం కనబర్చి ఎందరో అభిమానులను కూడగట్టుకున్న ఈ బ్యూటీ పెళ్లయినా తరగని అందంలో అభిమానులను అలరిస్తుంది.
Related News

NTR : గోవాలో దేవర.. ఎన్టీఆర్ సినిమా ఏం జరుగుతుంది..?
NTR యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ముఖ్యంగా దేవర రెండు పార్టులుగా