Copter Crash: కొచ్చిలో కూలిన హెలికాప్టర్, ఇద్దరికి తీవ్ర గాయాలు
కొచ్చిలోని నేవల్ ఎయిర్ బేస్ ఐఎన్ఎస్ గరుడ వద్ద శనివారం నేవీ హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు నేవీ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
- By Balu J Published Date - 04:24 PM, Sat - 4 November 23
Copter Crash: కొచ్చిలోని నేవల్ ఎయిర్ బేస్ ఐఎన్ఎస్ గరుడ వద్ద శనివారం నేవీ హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు నేవీ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కాప్టర్ రోటర్ బ్లేడ్ కు సాంతికేతిక ఇబ్బందులు తలెత్తడంతో రన్‌వేపై ఉన్న నేవీ సిబ్బంది తలకు తీవ్ర గాయాలయ్యాయి.
చేతక్ హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సదరన్ నేవల్ కమాండ్‌లోని నేవల్ హాస్పిటల్ ఐఎన్‌హెచ్‌ఎస్ సంజీవనికి తరలించారు. శిక్షణ సమయంలో సాంకేతిక లోపం కారణంగా చేతక్ హెలికాప్టర్ కుప్పకూలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనను సదరన్ నేవల్ కమాండ్ ధృవీకరించలేదు. కానీ ఎర్నాకుళం హార్బర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు.
Also Read: Delhi: ఢిల్లీలో డేంజర్ బెల్స్, వాయు కాలుష్యంతో సిటీజనం ఉక్కిరిబిక్కిరి!