Global NCAP Crash Test : గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్: వ్యాగన్ ఆర్, ఆల్టో K10 సేఫ్టీపై అనుమానాలు
మారుతి సుజుకి వ్యాగన్ R గ్లోబల్ NCAP నుంచి పెద్దల క్రాష్ కోసం 1 స్టార్ మరియు పిల్లల భద్రత రేటింగ్‌ల కోసం 0 స్టార్‌లను పొందింది.
- By Maheswara Rao Nadella Published Date - 07:00 PM, Thu - 6 April 23

Global NCAP Crash Test : న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం (NCAP) ఒక సంచలన రిపోర్ట్ ను విడుదల చేసింది. తాము ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లలో ఆల్టో K10, వ్యాగన్ఆర్ కార్ల మోడళ్లు ఘోరంగా విఫలమయ్యాయని తెలిపింది. మన దేశంలో అత్యధికంగా అమ్ముడుబోతున్న కంపెనీ మోడల్స్‌లో ఇవి రెండు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన సేఫ్టీ టెస్ట్‌లలో ఆల్టో K10 కారు 2 స్టార్ రేటింగ్, వ్యాగన్ ఆర్ 1స్టార్ రేటింగ్ మాత్రమే పొందాయి.
మారుతి సుజుకి వ్యాగన్ R గ్లోబల్ NCAP నుంచి పెద్దల క్రాష్ కోసం 1 స్టార్ మరియు పిల్లల భద్రత రేటింగ్‌ల కోసం 0 స్టార్‌లను పొందింది. భారతదేశంలో అత్యంత జనాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా ఉన్నప్పటికీ, భద్రతా పారామితులకు సంబంధించినంత వరకు ఇది ఎప్పుడూ ప్రశంసలు అందుకోలేదు. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 కార్ల జాబితాలో స్థిరంగా ఉంటుంది.
మారుతీ సుజుకి స్పందన ఇదీ..
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ ఫలితాలపై మారుతీ సుజుకి స్పందించింది. భారతీయ కస్టమర్లకు సురక్షితమైన కార్లను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. మారుతి సుజుకీ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని.. భారతదేశం క్రాష్ సేఫ్టీ నిబంధనలు యూరప్‌లోని ప్రమాణాలకు దాదాపు సమానంగా ఉంటాయని పేర్కొంది. నిబంధనల మేరకు తమ కార్లను భారత ప్రభుత్వం సర్టిఫై చేసిందని చెప్పింది.
తమ కార్లలో హిల్-హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ-వ్యూ కెమెరా, హుడ్ డిస్‌ప్లే వంటి అదనపు సెక్యూరిటీ ఫీచర్‌లను అందిస్తున్నట్లు మారుతీ సుజుకి తెలిపింది. కస్టమర్ల కోసం కార్లను తయారు చేస్తున్నప్పుడు భద్రతను ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటిగా భావిస్తామని చెప్పింది. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలకు బదులుగా.. త్వరలో లాంచ్ కానున్న ఇండియన్ వెర్షన్ భారత్ ఎన్‌సీఏపీపై దృష్టి పెడతామని పేర్కొంది. ఇండియా త్వరలోనే భారత్ ఎన్‌సీఏపీ తీసుకొస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది.
భారతదేశం సొంత అసెస్‌మెంట్ ఏజెన్సీ..
భారతదేశం సొంత వెహికల్ సేఫ్టీ అసెస్‌మెంట్ ఏజెన్సీ భారత్ ఎన్‌సీఏపీ ఈ సంవత్సరం నుంచి మన దేశంలో తయారైన వాహనాల క్రాష్ టెస్ట్‌లను ప్రారంభించనుంది. గత ఏడాది జూన్‌లో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఈ పరీక్షలు ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయని డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Also Read: E Bike R.x275: సైకిల్ కాదు.. మౌంటెన్ ఎలక్ట్రిక్ బైక్.. స్పెషాలిటీస్ అదుర్స్