మేయర్,మంత్రులకు భారీ జరిమానా విధించిన జీహెచ్ఎంసీ…కారణం ఇదే…?
హైదరాబాద్ మహానగరంలో రోడ్లపై కటౌట్లు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగ్లపై జీహెచ్ఎంసీ నిషేధం విధించింది. గతంలో పలువురికి జరిమానాలను కూడా విధించింది.
- By Hashtag U Published Date - 12:54 PM, Sat - 30 October 21

హైదరాబాద్ మహానగరంలో రోడ్లపై కటౌట్లు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగ్లపై జీహెచ్ఎంసీ నిషేధం విధించింది. గతంలో పలువురికి జరిమానాలను కూడా విధించింది.
అయితే ఇటీవల హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఘనంగా జరిగింది. దీని కోసం నగరమంతా ఫ్లెక్సీలు,హోర్డింగ్లు,బ్యానర్లతో లీడర్లు గులాబీమయం చేశారు.ప్రధాన కూడళ్లలో సిగ్నల్ లైటింగ్స్ కనపడకుండా సైతం హోర్డింగ్లు ఏర్పాటు చేయడాన్ని నగర వాసులు ట్విట్లర్లో జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు.అయితే ఆ రెండు రోజులు జీహెచ్ఎంసీ సైతం ఫిర్యాదులు తీసుకోలేదని ఆరోపణలు వినిపించాయి.చాలా మంది సామాన్యులు రోడ్లపై ఉన్న కటౌట్ల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. గతంలో మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ,కార్పోరేషన్ లో రోడ్డుపై ఎక్కడా కూడా ఒక్క ఫ్లెక్సీ కూడా ఉండటానికి వీల్లేదని…ముందుగా టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలనే తొలగించాలని నాడు కేటీఆర్ మీడియా ముఖంగా తెలిపారు.ఈ వ్యాఖ్యలను పట్టుకుని నెటిజన్లు ఇప్పుడు నగరంలో ఉన్న ఫ్లెక్సీల సంగతేంటని ప్రశ్నించారు.
ప్లీనరీ ముగిసిన తరువాత కూడా నగరవాసుల నుంచి జీహెచ్ఎంసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ,మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లా రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్ సహా పలువురు టీఆర్ఎస్ నేతలకు జరిమానాలు విధించింది. ప్లీనరీ రోజున టీఆర్ఎస్ రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని రోడ్లన్నీ గులాబీ రంగు జెండాలు, పెద్ద హోర్డింగ్లతో నిండిపోయింది. నగరవాసుల ఫిర్యాదుల ఆధారంగా GHMC డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్మెంట్ (EV&DM) సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ టిఆర్ఎస్ నాయకులకు రూ. 5,000 నుండి రూ. 2 లక్షల వరకు జరిమానా విధిస్తూ పలు చలాన్లను జారీ చేసింది.
డైరెక్టరేట్ ఆఫ్ EV&DM సాధారణంగా ఇటువంటి ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తుంది…అయితే సర్వర్ నిర్వహణ, సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేయడం వల్ల ఈ-చలాన్ జనరేట్ చేయడాన్ని నిలిపివేసినట్లు చెబుతూ, ప్లీనరీకి కొన్ని రోజుల ముందు డిపార్ట్మెంట్ అందుబాటులో లేదు. రెండు రోజుల తరువాత హోర్డింగ్లపై వచ్చిన పలు ఫిర్యాదుల మేరకు సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఈ-చలాన్లను రూపొందించింది. నగరంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసినందుకు టీఆర్ఎస్ నేత రాగం సుజాత నాగేందర్ యాదవ్ కు రెండు లక్షల రూపాయల జరిమానాను జీహెచ్ఎంసీ విధించింది.మరో టీఆర్ఎస్ నేత మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ కు రూ.50,000 జరిమానా విధించింది.
GHMC has imposing fines TRS leaders for unauthorised erection of banners and cutouts, @MyHyderabad2 @GHMCOnline pic.twitter.com/aNPg3WmL67
— My Hyderabad (@MyHyderabad2) October 30, 2021
Related News

Balapur Ganesh Laddu Auction : నేడు బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. ఈ సారి కూడా రికార్డుస్థాయి ధర పలికే ఛాన్స్
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ఘనంగా ప్రారంభమైంది. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయత్ర ట్యాంక్‌బండ్ వైపు