Elephant :కరెంట్ షాక్ కి గురైన తన బిడ్డను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఏనుగు
రళలోని పాలక్కాడ్ జిల్లా సమీపంలోని మలంపుజ అడవుల్లో మంగళవారం ఉదయం మూడేళ్ల మగ ఏనుగు మృతి చెందింది
- Author : Hashtag U
Date : 17-11-2021 - 11:13 IST
Published By : Hashtagu Telugu Desk
రళలోని పాలక్కాడ్ జిల్లా సమీపంలోని మలంపుజ అడవుల్లో మంగళవారం ఉదయం మూడేళ్ల మగ ఏనుగు మృతి చెందింది. ఏనుగు విద్యుత్ తీగకు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.తన బిడ్డను కాపాడుకోవడానికి తల్లి ఏనుగు తీవ్ర ప్రయత్నాలు చేసింది. చనిపోయిన బిడ్డ తిరగి వస్తుందనే ఆశతో పిల్ల ఏనుగును బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉన్న వీడియో హృదయాన్ని కదిలిస్తుంది.ఏనుగు మృతి వార్త తెలియగానే అటవీ, వన్యప్రాణి అధికారులతో పాటు పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
హెచ్చరిక: కొంతమందికి విజువల్స్ ఇబ్బంది కలిగించవచ్చు
Tragic visuals from Kerala. A mother trying to revive her child, a 3-year-old elephant who died allegedly due to electrocution. pic.twitter.com/qOZt9DTbV8
— Sanyukta (@dramadhikari) November 17, 2021
ప్రమాదం జరిగిన ప్రదేశానికి జనం చేరుకునే సరికి మరో మూడు ఏనుగులు కరెంటు షాక్‌కు గురైన ఏనుగుకు కాపలాగా ఉండడంతో దాన్ని తోసుకుంటూ లేవాలని సంకేతాలు ఇవ్వడం కనిపించింది. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) కుర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ బోర్‌వెల్‌కు కనెక్ట్ చేయబడిన లైవ్ వైర్ ఉందని…దానిని ఏనుగు తాకినట్లు తెలుస్తోంది. ఏనుగుల గుంపు ఒక ప్రైవేట్ ఎస్టేట్ మరియు అక్కడ ఉన్న పంప్ హౌస్‌లోకి ప్రవేశించిందని ఆ ప్రాంత నివాసితులు తెలిపారు. ఏనుగు పిల్ల పంప్‌హౌస్‌లోని వైర్‌ని నమలడానికి ప్రయత్నించిందని… అందుకే విద్యుదాఘాతానికి గురైందని వారు ఆరోపించారు.
అయితే చనిపోయిన ఏనుగు శవపరీక్ష ప్రక్రియ చేపట్టేందుకు వీలుగా మూడు ఏనుగులను అడవుల్లోకి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చినిపోయిన పిల్ల ఏనుగును పూడ్చేందుకు ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. పంప్ హౌస్ మరియు ఎస్టేట్‌లోని విద్యుత్ కనెక్షన్‌లపై కూడా విచారణకు ఆదేశించారు.