ఆ గ్రామంలో తొలి వికలాంగ వైద్యురాలు ఈమె..!
చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజీలో షంసియా అఫ్రీన్ చేరిందన్న వార్త విన్న మెర్పనైక్కడు గ్రామం మొత్తం శుక్రవారం సంబరాల్లో మునిగిపోయింది.
- By Hashtag U Published Date - 02:01 PM, Sat - 29 January 22

చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజీలో షంసియా అఫ్రీన్ చేరిందన్న వార్త విన్న మెర్పనైక్కడు గ్రామం మొత్తం శుక్రవారం సంబరాల్లో మునిగిపోయింది. అరంతంగిలోని ఈ గ్రామం నుంచి తొలి వికలాంగ వైద్యురాలిగా షంసియా రానున్నారు. షంసియా ఆఫ్రీన్ తండ్రి ముతాలిఫ్ కూడా శారీరకంగా వికలాంగుడు. ముతాలిఫ్‌కు చిన్నతనంలోనే పోలియో సోకడంతో నడవలేని పరిస్థితి ఏర్పడింది.
తాను కొన్నేళ్లుగా ఆసుపత్రుల్లో ఉంటాను. బయట కూడా ఉండేదానినని. ఆ సమయంలో తనకు తెలియని చాలా మంది సహాయం చేసారని ఆమె తెలిపింది. వారిని చూసి తాను డాక్టర్ అయ్యి సహాయం చేయాలని నిర్ణయించుకున్నానని షంశియ తెలిపారు. చదువు ప్రపంచంలోనే అత్యుత్తమ సాధనమని తన కూతురు నిరూపించిందని ముతాలిఫ్ చెప్పారు. తన కూతురు తన కుటుంబాన్ని ఎంతగానో గర్వించేలా చేసిందని.. తమని ధిక్కరించిన వాళ్లు ఈరోజు అభినందిస్తున్నారని ముతాలిఫ్ తెలిపారు. మంచి చదువుతో ఏదైనా సాధించవచ్చని నిరూపించిందని. ఇతర శారీరక వికలాంగ పిల్లలకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.మెర్పనైక్కడు ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో తమిళ మాధ్యమంలో షంశియా చదివింది. ఉపాధ్యాయులు తనకు సహకరించి, ప్రోత్సహించారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందించే తిసైగల్ సెంటర్ నుంచి నీట్ కోచింగ్ పొందింది. శంసియా రోజూ తరగతికి వచ్చేందుకు కేంద్రం ప్రత్యేకంగా బస్సును కూడా ఏర్పాటు చేసింది.
షంసియాకు MBBS సీటు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని తిసైగల్‌కు చెందిన బాస్కరన్ తెలిపారు. ఆమె 60 రోజులు తరగతులకు హాజరయ్యిందని… లాక్‌డౌన్ సడలించిన తర్వాత మేము నిరంతరం తరగతులు నిర్వహించామని భాస్కరన్ తెలిపారు. ఆమెపై ప్రత్యేక ఆసక్తి కనబరిచిన ఉపాధ్యాయుల్లో ఒకరైన దర్వి మాట్లాడుతూ, తమ పాఠశాల, గ్రామం నుండి MBBS చదివిన మొదటి విద్యార్థి షంశియా అని దీనికి తాము గర్వపడుతున్నామని తెలిపారు.