Karur Stampede : తొక్కిసలాటలో 40కి చేరిన మృతుల సంఖ్య
Karur Stampede : నిన్న TVK పార్టీ చీఫ్ విజయ్ (Vijay) నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట మూడుగురే మృతి చెందారని వార్తలు వచ్చినా, తరువాత గాయపడినవారి పరిస్థితి విషమించడంతో మృతుల సంఖ్య అంతకంతకు పెరిగి, ఈరోజు 40కి చేరుకుంది
- By Sudheer Published Date - 05:15 PM, Sun - 28 September 25

తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట (Karur Stampede) ఘటన రాష్ట్రాన్ని, దేశాన్ని కలిచివేసింది. నిన్న TVK పార్టీ చీఫ్ విజయ్ (Vijay) నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట మూడుగురే మృతి చెందారని వార్తలు వచ్చినా, తరువాత గాయపడినవారి పరిస్థితి విషమించడంతో మృతుల సంఖ్య అంతకంతకు పెరిగి, ఈరోజు 40కి చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒకరు ఈరోజు ఉదయం మరణించడంతో ఈ సంఖ్యకు చేరినట్లు అధికారులు ధృవీకరించారు.
CBN Meets Pawan : పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
ఈ తొక్కిసలాటలో అత్యధికంగా మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం మరింత దుర్ఘటనగా మారింది. భారీగా జనసందోహం ఏర్పడటం, సదుపాయాలు తక్కువగా ఉండటం, తగిన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల వాతావరణంలో ప్రజల్లో ఉత్సాహం ఎక్కువగా ఉండటం, నాయకుడిని చూసేందుకు వేలాది మంది ఒకే స్థలంలో గుమికూడటమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.
మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడినవారికి తగిన చికిత్స అందించేందుకు కేంద్రం, రాష్ట్రం కలిసి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఘటన వల్ల రాష్ట్రవ్యాప్తంగా శోకసంద్రం నెలకొంది. భవిష్యత్తులో ఇలాంటి సభల్లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయడం, ప్రజల రక్షణకు తగిన చర్యలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.