Chennai : చెన్నైలో మెట్రో బస్సు కండక్టర్‌పై వేటు.. మహిళా ప్రయాణికులపై..!
ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినందుకు చెన్నైలో మెట్రో బస్సు కండక్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. శివసూదన్ అనే
- By Prasad Published Date - 11:51 AM, Tue - 24 January 23

ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినందుకు చెన్నైలో మెట్రో బస్సు కండక్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. శివసూదన్ అనే కండక్టర్, మహిళా ప్రయాణికురాలితో వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అతన్ని అధికారులు సస్పెండ్ చేశారు. జనవరి 19న చెన్నై సెంట్రల్-ఎన్నోర్ మధ్య ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులు తమకు టిక్కెట్లు ఇవ్వడానికి బస్సు కండక్టర్ నిరాకరించారని ఫిర్యాదు చేశారు. ఉచితంగా ప్రయాణించే మహిళలకు టిక్కెట్లు ఇవ్వనని బస్ కండక్టర్ దురుసుగా మాట్లాడారని మరికొంత మంది మహిళా ప్రయాణికులతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న సంగీత ఆరోపించింది. తమిళనాడులో మహిళా సాధికారత కోసం సీఎం స్టాలిన్ ప్రవేశపెట్టిన పథకం ద్వారా ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అలాంటి బస్సుల్లో ప్రయాణం చేయాలనుకునే మహిళలకు కండక్టర్లు డబ్బులు తీసుకోకుండా వేరే టిక్కెట్టు ఇస్తారు. అయితే కండక్టర్ శివసూదన్.. సంగీత అనే మహిళలకు టికెట్ ఇవ్వకపోవడంతో కొత్త వాషర్‌మాన్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. శివసూదన్ ఆమెకు క్షమాపణ చెప్పడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. కాగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఉన్నతాధికారులు శివసుదన్‌ను సస్పెండ్ చేశారు

Related News

Chennai : చెన్నైలో విషాదం.. భవనం గోడ కూలి టెక్కీ మృతి
చెన్నైలోని థౌజండ్ లైట్స్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. కూల్చివేస్తున్న శిథిలావస్థలో ఉన్న భవనం గోడ పడటంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందింది. మృతురాలు మధురైకి చెందిన పద్మప్రియగా గుర్తించారు. ఈ ఘటన జరిగినప్పుడు ప్రియ తన స్నేహితురాలితో కలిసి థౌజండ్ లైట్స్ మెట్రో స్టేషన్ నుంచి తన ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెపై గోడ పడడంతో స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్