Chennai Rains:తమిళనాడులో వరదల్లో కొట్టుకొస్తున్న పాములను ఏం చేస్తున్నారో తెలుసా?
వారం రోజులుగా తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో వరదలు పారుతున్నాయి.
- By Hashtag U Published Date - 04:29 PM, Sun - 14 November 21

వారం రోజులుగా తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో వరదలు పారుతున్నాయి. ఈ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.
వర్షాల సమయంలో పాములు కొట్టుకొస్తున్నాయని కాల్ సెంటర్స్ కి ఫోన్స్ వస్తున్నాయట. పాములను పట్టుకోవడంలో నిపుణులైన సిబ్బందితో పాటు స్వచ్ఛంద సేవకులను కూడా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం రెస్క్యూ టీమ్ ప్రజలతో పాటు మూగజీవాలను కూడా రక్షిస్తున్నారు.

స్నేక్ క్యాచర్ వేద ప్రియ
రెస్క్యూ టీమ్ సహాయచర్యలు చేసేక్రమంలో చెట్లకు చిక్కుకున్న, నీటిలో కొట్టుకుపోతున్న పాములను గుర్తించి వాటిని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నిపుణులు, స్నేక్ క్యాచర్స్ సహాయంతో కాపాడి అడవిలో వదిలివేస్తున్నారట. వర్షాల సమయంలో వచ్చే కొన్ని రకాల విషపురుగులతో పాటు 20కి పైగా పాములను రక్షించినట్లు అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు.
వరదల్లో చిక్కుకున్న పాములను నగర పరిధిలోని మంబక్కం, తిరుపోరూర్ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో సురక్షితంగా వదులుతున్నామని స్నేక్ క్యాచర్ విష్ణు ప్రియ తెలిపారు.

పాము పట్టేవారి పేర్లు
Related News

Nagula Chavithi: పాములు పూజించడం మూఢనమ్మకమా.. అసలు పుట్టలో పాలు పోయకూడదా?
నాగుల చవితి రోజు పుట్టక పాలు పోయడం నాగదేవతను పూజించడం అన్నది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. హిందువులు ఈ నాగుల చవితిని గొప్ప