5000 మందితో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా మానవహారం.. గిన్నిస్ రికార్డు!
స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుగుతున్న వేళ యావత్ దేశంలో తిరంగా రెపరెపలు కనిపిస్తున్నాయి.
- By Hashtag U Published Date - 06:00 AM, Mon - 15 August 22
స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుగుతున్న వేళ యావత్ దేశంలో తిరంగా రెపరెపలు కనిపిస్తున్నాయి. ఈ అద్భుత తరుణంలో ఒక కొత్త గిన్నిస్ రికార్డు నమోదైంది. చండీగఢ్ వాసులు ఒక వైవిధ్య ప్రయత్నంతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.చండీగఢ్ విశ్వవిద్యాలయంలోని సుమారు 16 ఎకరాల క్రికెట్ స్టేడియంలో.. వేలాది మంది కలిసి జాతీయ జెండా ఆకారంలో మానవహారంగా నిలబడ్డారు. చండీగఢ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు, NID ఫౌండేషన్‌కి చెందిన వలంటీర్లు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను కేంద్ర విదేశాంగ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి తన ట్విట్టర్లో షేర్ చేశారు. “భారతదేశానికి గర్వకారణం. చండీగఢ్‌లోని క్రికెట్ స్టేడియంలో గౌరవ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ జీ సమక్షంలో జెండా ఊపడం ద్వారా భారతదేశం గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించినందుకు సంతోషిస్తున్నాము” అని లేఖి ఆ పోస్టులో పేర్కొన్నారు.
Proud Moment for India 🇮🇳
Elated to share that India has made the Guinness World Record for making the Largest Human Image of a Waving Flag in the presence of Hon Governor Sh Banwarilal Purohit Ji at Cricket Stadium, Chandigarh. @GWR #AmritMahotsav #IndiaAt75 pic.twitter.com/WEMCGOXlVM
— Meenakashi Lekhi (@M_Lekhi) August 13, 2022
ఆజాదీకా అమృత మహోత్సవంలో..
ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ చేపట్టిన హర్ ఘర్ తిరంగ ప్రచారాన్ని బలోపేతం చేసేలా చండీగఢ్ వాసులు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
కార్యక్రమంలో సుమారు 5 వేల మందికి పైగా మానవహారంగా నిలబడి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్ఐడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కేంద్ర మంత్రి మీనాకాశీ లేఖి, చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్సలర్ సత్నామ్ సింగ్ సంధు, విశ్వవిద్యాలయ అధికారులు తదితరులు హాజరయ్యారు.
Related News
Indian Flag: ఇండియా ఫ్లాగ్ తో అఫ్రిది కుమార్తె
చిరకాల ప్రత్యర్థి భారత్ తో మ్యాచ్ అంటే పాకిస్థాన్ ఫాన్స్ తమ దేశపు జెండా తోనే హల్ చల్ చేస్తారు.