Kerala : కన్నబిడ్డలను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కసాయి తల్లి
Kerala : గ్రామంలో ఒక ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడం గమనించిన స్థానికులు మొదట పక్కవారిని అడిగి తెలుసుకునే యత్నించారు
- By Sudheer Published Date - 07:13 PM, Mon - 30 June 25

కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలో ఒక తల్లి తన చిన్నారులను హత్య చేసి ఇంటి వెనుక భాగంలో పాతిపెట్టిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మానవత్వాన్ని తాకట్టు పెట్టిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలానికి దారితీసింది. స్థానికుల సమాచారం మేరకు.. గ్రామంలో ఒక ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడం గమనించిన స్థానికులు మొదట పక్కవారిని అడిగి తెలుసుకునే యత్నించారు. అయితే స్పష్టత లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని తనిఖీ చేశారు.
Liquor case : పోలీస్ కస్టడీకి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
ఇంటి వెనుక భాగంలో మట్టిని తవ్వగా చిన్న చిన్న మృతదేహాలు బయటపడాయి. దర్యాప్తులో ఆ మృతదేహాలు ఆరేళ్ల మగబిడ్డ, మూడేళ్ల ఆడబిడ్డవిగా గుర్తించారు. మృతుల తల్లి వారిని హత్య చేసి అక్కడే పాతిపెట్టినట్లు ఆరోపణలు వెల్లడి కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘోర చర్యకు ఆమె ఏ కారణంతో పాల్పడిందన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలు, మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. గ్రామస్థులు ఈ అమానుష ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటన సమాజంలో కుటుంబ సంబంధాల మధ్య పెరుగుతున్న ఒత్తిళ్లపై తీవ్ర ప్రశ్నలు లేపుతోంది. కుటుంబాల్లో ఒత్తిడులు, అవగాహనల లోపం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నా, సమయానికి సలహా, మానసిక సహాయం అందకపోవడం విషాదాంతాలకు దారితీస్తోంది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారికి సమర్థమైన కౌన్సిలింగ్, వైద్య సహాయం అందించే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం, సామాజిక సంస్థలు, కుటుంబాలు చురుకుగా స్పందించాలని నిపుణులు సూచిస్తున్నారు.