Bird flu: మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. 1800 కోళ్లు మృతి!
మళ్లీ బర్డ్ ప్లూ (Bird flu) కారణంగా 1,800 కోళ్లు చనిపోయాయని అధికారిక వర్గాలు తెలిపాయి.
- By Balu J Published Date - 02:03 PM, Thu - 12 January 23

దేశంలో (India) ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్స్ ప్రభావం చూపుతుంటే.. మరోవైపు బర్డ్ ఫ్లూ (Bird flu) కలకలం రేపుతోంది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇన్ఫెక్షన్ కారణంగా సుమారు 1,800 కోళ్లు చనిపోయాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇటీవల జిల్లా పంచాయతీ నిర్వహించే స్థానిక ఫారంలోని పౌల్ట్రీలో H5N1 వేరియంట్ ఉనికిని గుర్తించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ విషయంలో కేంద్రం మార్గదర్శకాలు, ప్రోటోకాల్ ప్రకారం అత్యవసర నివారణ చర్యలు తీసుకోవాలని కేరళ పశుసంవర్ధక మంత్రి జె చించు రాణి ఆదేశాలు ఇచ్చారు. ప్రాథమిక పరీక్షలు బర్డ్ ఫ్లూ (Bird flu) వ్యాప్తిని సూచించడంతో, నమూనాలను భోపాల్ (మధ్యప్రదేశ్)లోని హై సెక్యూరిటీ ల్యాబ్‌కు పంపి, ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజాను నిర్ధారించారని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఫారంలో 5,000 పైగా కోళ్లు ఉన్నాయి. వాటిలో 1,800 ఇన్ఫెక్షన్ (Bird flu) కారణంగా ఇప్పటివరకు చనిపోయాయి.
Also Read: Veera Simha Reddy OTT: ఓటీటీలోకి వీరసింహారెడ్డి.. రిలీజ్ డేట్ ఫిక్స్!