అక్కడ ఆటో ఎక్కాలంటే ఆలోచించాల్సిందే..
ఒకవైపు కరోనా.. మరోవైపు లాక్ డౌన్ కారణంగా ఆటో డ్రైవర్లు ఎంతో నష్టపోయారు. దీనికితోడు పెట్రోల్, డిజీల్ ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు ఆటో డ్రైవర్లు చార్జీలను పెంచేశారు.
- By Balu J Published Date - 02:44 PM, Sat - 2 October 21

ఒకవైపు కరోనా.. మరోవైపు లాక్ డౌన్ కారణంగా ఆటో డ్రైవర్లు ఎంతో నష్టపోయారు. దీనికితోడు పెట్రోల్, డిజీల్ ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు ఆటో డ్రైవర్లు చార్జీలను పెంచేశారు. ఈ మేరకు బెంగళూరు అర్బన్ జిల్లా కమిషనర్, రవాణా ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ చైర్మన్ తో సమావేశమై ఈ విషయాన్ని తెలిపారు. తాజా నిర్ణయంతో ఆటో ధరలు పెరిగాయి. ఆటో ఎక్కిదిగితే రూ. 30 వదిలించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ. 25గా ఉన్న కనీస ధరను రూ. 30కి పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా ఎల్పీజీ ధరలు కూడా దారుణంగా పెరిగిపోతున్నాయని, లీటరు ఎల్పీజీ గ్యాస్ ధర 2013లో రూ. 28గా ఉంటే ప్రస్తుతం రూ. 49.95గా ఉందని ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సీఎన్ శ్రీనివాస్ తెలిపారు. దీంతో కనీస చార్జీని పెంచాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. అలాగే, లాక్‌డౌన్ ప్రభావం కూడా ఆటో డ్రైవర్లపై దారుణంగా పడిందని, అందుకే చార్జీలు పెంచాల్సి వచ్చిందని డ్రైవర్లు తెలిపారు.
ఐటీ రంగానికి కేరాఫ్ అయిన బెంగళూరుకు మరిన్ని రైళ్లు నడవనున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో బెంగళూరు-ధార్వాడల మధ్య వందేభారత్ రైలు పట్టాలెక్కవచ్చునని అధికారులు భావిస్తున్నారు. బెంగళూరు నుంచి అమరావతి వైపు కూడా మరో వందేభారత్ రైలు సేవలను ప్రారంభించే దిశలో బెంగళూరు ఎంపీలు ఇటీవల కేంద్ర రైల్వే శాఖకు ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.
Tags
