మంచి కాఫీ లాంటి మ్యూజిక్.. ఈ బాయ్స్ సొంతం!
డజనుకు పైగా దేశాల్లో లెక్కలేనన్ని ప్రదర్శనలు అనేక జాతీయ అవార్డులు, గుర్తింపులను గెలుచుకున్న మసాలా కాఫీ ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ హృదయాలను కొల్లగొడుతోంది.
- By Balu J Published Date - 03:07 PM, Mon - 25 October 21

డజనుకు పైగా దేశాల్లో లెక్కలేనన్ని ప్రదర్శనలు అనేక జాతీయ అవార్డులు, గుర్తింపులను గెలుచుకున్న మసాలా కాఫీ ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ హృదయాలను కొల్లగొడుతోంది. పెర్కషన్ వాద్యకారుడు వరుణ్ సునీల్ ఆలోచన నుంచి “మసాలా కాఫీ” 2014 చివరలో ఏర్పడింది. భారతీయ టెలివిజన్ ఛానెల్ కప్పా టివి ‘మ్యూజిక్ మోజో’ ఎపిసోడ్‌లలో ఇచ్చిన ప్రదర్శనల ద్వారా యూట్యూబ్ లో వైరల్ అయ్యాయి. ఎక్కడా లేని స్టార్‌డమ్ ను తెచ్చి పెట్టింది. 8 మంది పాటల రచయితలు, కళాకారులు కలలు కనేవారి అద్భుత సమ్మేళనం ఇది. లోకల్ టు గ్లోబల్ అంటూ దేశమంతా ఈ బ్యాండ్ యువత మది దోచేస్తుంది. మసాలా కాఫీ పాటలు ఎల్లప్పుడూ శ్రోతలను ఆకర్షిస్తుంది. ఫ్యూచరిస్టిక్ సోనిక్ డ్రోన్‌లకు సంప్రదాయ ధ్వని శబ్దాలను చొప్పిస్తూ, ప్రతి పాటకు భిన్నమైన కంపోజింగ్ ఉంటుంది. ఈ బ్యాండ్ ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బమ్ ‘EKTARA’ పై పని చేస్తోంది. వీటితో పాటు బ్లాక్ బస్టర్ సినిమా దుల్కర్ “కన్నులు కన్నులు దోచాయంటే” తర్వాత రెండు తెలుగు సినిమాలకు సంగీతం అందించనున్నారు.
We keep singing about Madhalam and Timila. Here you go, we’re playing it for you now 😄
Varun on Madhalam
Sooraj on Timila
Daya on veek chenda#backstagefun https://t.co/YaJtuJAV3T— Masala Coffee (@MasalaCoffee) January 13, 2019
తెలుగులో డిఫరెంట్ గా
‘‘ప్రజలు దీన్ని ఇష్టపడతారో లేదో మాకు తెలియదు, కానీ బెస్ట్ మ్యూజిక్ అందించడానికి మా వంతు కృషి చేస్తామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. ఇక హైదరాబాద్ మాకు రెండో ఇల్లు. హైదరాబాద్ సిటీలో చాలాసార్లు ప్రదర్శనలు ఇచ్చాం. తెలుగులో డిఫరెంట్ ప్రోగ్సామ్ ఏదైనా చేయాలని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు’’ అని బ్యాండ్‌లో భాగమైన ఇండియన్ ఐడల్ విజేత అస్లాం చెప్పారు.
పలు సినిమాలకు..
మలయాళం లో “సోలో” చిత్రానికి సంగీతం అందించారు. ఇది బాగా పేరు తీసుకొచ్చిన సినిమా
తమిళ్ లో 2 సినిమాలు ( 2016 లో URIYADI 2020 lo Kannum Kannum Kollaiyadithaal)
కన్నడ లో ఒక చిత్రం Mundina Nildana (2019)