Ustaad Review : ఉస్తాద్ – స్పీడ్ తగ్గింది
- By Sudheer Published Date - 11:50 AM, Sat - 12 August 23

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి వారసుడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన శ్రీ సింహ కోడూరి (Simha Koduri).. ‘మత్తు వదలరా’ మూవీ తో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ సింహ.. ఆ తర్వాత ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ లాంటి సినిమాలు చేసినా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తాజాగా ‘ఉస్తాద్’ (Ustaad) మూవీ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సాయి కొర్రపాటి, క్రిషీ ఎంటర్తైన్మెంట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా, ఫణిదీప్ డైరెక్ట్ చేసారు. చిత్ర స్టిల్స్ , టీజర్ , ట్రైలర్ ఆకట్టుకోవడం తో సినిమా ఫై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ వేడుకకు రాజమౌళి , హీరో నాని హాజరు కావడం తో సినిమా ఫై మరింత అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..? ఉస్తాద్ కథ ఏంటి..? శ్రీ సింహ ఖాతాలో హిట్ పడ్డట్లేనా..? వంటివి తెలుసుకుందాం.
కథ (Ustaad Story) :
సూర్య (శ్రీ సింహ ) చిన్న వయసులోనే తండ్రి శివ కుమార్ (వెంకటేష్ మహా) చనిపోవడం తో.. తల్లి (అను హాసన్) పెంపకంలో పెరుగుతాడు. చాల మొండిగా ఉంటాడు..ఏదైనా కావాలంటే అది దక్కేవరకు పోరాడుతూనే ఉంటాడు. ఆలా చిన్న వయసులోనే ఓల్డ్ బైక్ ఫై ఇష్టపడి దానిని కొనుకుంటాడు. దానికి ఉస్తాద్ అనే పేరు పెడతాడు. ఏ విషయంలోనూ సూర్యకు ఓ క్లారిటీ అంటూ ఉండదు.
ఏది పడితే అది చేస్తుంటాడు. అలాంటి సూర్య లైఫ్ లోకి మేఘన (కావ్యా కళ్యాణ్ రామ్) వస్తుంది. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. అయితే సూర్య కు చిన్నప్పటి నుండి కూడా ఎత్తైన ప్రదేశాలంటే ఎంతో భయం. అలాంటి భయం ఉన్న సూర్య..పైలెట్ అయి గాల్లో తేలిపోవాలని అనుకుంటాడు. ఆ తవ్రతః ఏంజరుగుతుంది..? సూర్య ఫైలెట్ అవుతాడా..? సూర్య – మేఘన ప్రేమ సక్సెస్ అవుతుందా..లేదా..? సూర్య లైఫ్ లో ఉస్తాద్ ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది..? అనేవి మీరు తెరపై చూడాల్సిందే.
ప్లస్ (Ustaad):
* శ్రీ సింహ యాక్టింగ్
* సెకండ్ హాఫ్
* లవ్ ట్రాక్
మైనస్ (Ustaad):
* స్లో నేరేషన్
* క్లైమాక్స్
నటీనటుల తీరు :
మొదటి నుండి కూడా శ్రీ సింహ విభిన్న పాత్రలకే ఎక్కువ మొగ్గు చూపిస్తూ..తన నటనను పెంచుకుంటూ వచ్చాడు. ఈ మూవీ లో కూడా తన యాక్టింగ్ తో అలరించాడు. కావ్య తో ప్రేమ సన్నివేశాల్లోనే కాదు , ఫ్యామిలీ సెంటిమెంట్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టాడు. అలాగే మిగిలిన పాత్రల్లో కూడా అంత చక్కగా నటించి ఆకట్టుకున్నారు. బలగం ఫేమ్ కావ్యా కళ్యాణ్ కనిపించినంతలో ఓకే అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్ పాత్ర ఆకట్టుకుంది. శ్రీ సింహ కు తల్లిగా అను హాసన్ మంచి పాత్రను పోషించింది. గౌతమ్ మీనన్ మరోసారి అలరించాడు.
సాంకేతిక వర్గం :
మ్యూజిక్ పర్వాలేదు అనిపించగా..కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఓకే అనిపించింది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే..రాసుకున్న కథను తెరపై సరిగా చూపించలేకపోయారు. సినిమా అంత స్లో గా నడిపించేసరికి ప్రేక్షకులకు బోర్ కొట్టింది. మనుషుల్ని నమ్మడం కంటే మిషిన్లను నమ్మాలి అంటూ ఓ డైలాగ్ చెప్పించాడు దర్శకుడు. మరి ఆ మెషిన్లను తయారు చేసేదే మనిషి కదా? అన్న లాజిక్ మరిచిపోయాడో ఏమో గానీ.. ఉస్తాద్ మాత్రం ఓ ఫెయిల్యూర్ ప్రయత్నంగానే మిగులుతుంది. బైక్ అనేది కుర్రకారుకు నిజంగానే ఓ ఎమోషన్. అయితే ఆ ఎమోషన్‌ను తెరపై తీసుకురాలేకపోయారు. కాకపోతే కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు బాగా తెరకెక్కించారు. ఇక క్లైమాక్స్ చెడగొట్టాడు. ఓవరాల్ గా మాత్రం కథ విషయంలో డైరెక్టర్ సరిగా రాసుకోలేక..ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాడు.
ఫైనల్ : ఉస్తాద్ – స్పీడ్ తగ్గింది
Read Also : Bro Final Collections : నిర్మాత కు ఎన్ని కోట్లు బొక్క అంటే…