Review : సారంగపాణి జాతకం – హాట్ సమ్మర్ లో కూల్ ఎంటర్టైనర్
- By Sudheer Published Date - 12:33 PM, Fri - 25 April 25

వరుస సూపర్ హిట్ చిత్రాలతో అలరిస్తున్న ప్రియదర్శి పులికొండ(Priyadarshi ).. రీసెంట్ గా ‘కోర్ట్’ (Court) మూవీతో భ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’(Sarangapani Jathakam)తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫీల్ గుడ్ మూవీస్ తీసే మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti) డైరెక్షన్లో సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ నడుస్తుంది.
ఈ చిత్ర కథ విషయానికి వస్తే..
హీరో సారంగపాణి ఒక జాతకాల పిచ్చోడు. కార్ షోరూమ్ లో సేల్స్ మెన్‌గా పని చేస్తూ, అదే షోరూంలో మేనేజర్‌గా ఉన్న మైథిలితో ప్రేమలో పడతాడు. ఇద్దరూ ప్రేమను పెళ్లి వరకు వెళ్లే సమయంలో సారంగపాణి అనుకోకుండా ఒక జ్యోతిష్కుడు జిగ్నేశ్వర్‌ను కలుస్తాడు. అతను నీ జాతకంలో “మర్డర్ చేస్తావ్” అని చెప్పడం తో సారంగపాణి గబ్బరవై, మైథిలికి అన్యాయం జరగకూడదని పెళ్లిని వాయిదా వేస్తాడు.
తనపై ఉన్న మర్డర్ దోషాన్ని తొలగించుకోవాలనే ఉద్దేశంతో తనే ఒక చెడ్డవాడిని చంపేయాలని సారంగపాణి తన ఫ్రెండ్ చందుతో కలిసి ప్రయత్నాలు మొదలుపెడతాడు. మొదట ఓ ముసలావిడను లక్ష్యంగా పెట్టుకున్న ప్రయత్నం విఫలమవుతుంది. తర్వాత తన షోరూమ్ హెడ్‌ని చంపాలని ప్లాన్ వేస్తాడు. కానీ ఈ ప్రయత్నాలు కూడా అర్థంతరంగా ముగుస్తాయి. మైథిలి పుట్టినరోజు పార్టీలో గొడవ అనంతరం, మైథిలి ఎంగేజ్మెంట్‌ను క్యాన్సిల్ చేసి, రెండు వారాల గడువు ఇస్తుంది. ఈలోపు తన సమస్యలను పరిష్కరించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది.
ఈ క్రమంలో సారంగపాణి తన స్నేహితులు చందు, రాంకీలతో కలిసి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు..? మర్డర్ జ్యోతిష్యం నిజమయ్యిందా? సారంగపాణి తన ప్రేమను గెలిచాడా? అన్నదే కథలో కీలక మలుపు. వినోదం, భయం, ప్రేమ, జాతకాలను చక్కగా మిక్స్ చేసిన ఈ కథ, ప్రేక్షకులను నవ్విస్తూ ఆలోచింపజేసేలా ఉంది. ఫస్ట్ హాఫ్ వెన్నెల కిషోర్, సెకండ్ హాఫ్ వైవా హర్ష కామెడీ టైమింగ్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. ఓవరాల్ గా కొద్దీ రోజులుగా సరైన సినిమా రాకపోవడం తో నిరాశలో ఉన్న సినీ లవర్స్ కు సారంగపాణి జాతకం మంచి ఎంటెర్టైనర్ అని చెప్పొచ్చు.