6 Journey : 6 జర్నీ మూవీ రివ్యూ..
- By News Desk Published Date - 10:46 PM, Fri - 9 May 25

6 Journey : రవి ప్రకాష్, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి.. పలువురు మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘6 జర్నీ’. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై బసీర్ ఆలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. 6 జర్నీ సినిమా నేడు మే 9న థియేటర్స్ లో రిలీజయింది.
కథ :
హైదరాబాద్ లో కొంతమంది వరుసగా చనిపోతూ ఉంటారు. ఒక ఫోన్ కాల్ వచ్చిన వెంటనే కొంతమంది చెవిలో నుంచి రక్తం కారి మరణిస్తారు. సెల్ సిగ్నల్స్ కంట్రోల్ చేసే కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ కిడ్నాప్ అవుతారు. ఇలాంటి సమయంలో ఆరుగురు యువతీయువకులు (రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి & కో) గోవాకు ప్రయాణం అవుతారు. ఈ జర్నీలో ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగితే ఇస్తారు. అయితే సిటీలో జరిగే మర్డర్స్ అతడే చేసాడేమో అని ఆరుగురికి డౌట్ కలుగుతుంది. అతని నుంచి తప్పించుకొనే క్రమంలో కొంతమంది తీవ్రవాదులు ఆ ఆరుగురితో పాటు అతడిని కూడా కిడ్నాప్ చేస్తారు. మరి తీవ్రవాదుల నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు? వీళ్ళు గోవాకు ఎందుకు వెళ్తున్నారు? అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు? తీవ్రవాదులు ఎందుకు వచ్చారు అని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
నటీనటులు :
కొత్త నటుడు రవి ప్రకాష్ రెడ్డి హీరోగా బాగానే మెప్పించాడు. ఇద్దరు హీరోయిన్స్ గ్లామర్ చూపిస్తూనే కాస్త పర్ఫార్మెన్స్ కూడా చేసారు. టేస్టీ తేజ అక్కడక్కడా నవ్వించాడు. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. అయితే చెప్పుకోదగ్గ నటులు ఎవరైనా ఉంటే బాగుండేది.
విశ్లేషణ :
తీవ్రవాదం అంటే అంటే తుపాకీ పట్టి చేసేది మాత్రమే కాదు టెక్నాలజీని కూడా వాడుకొని చేసారు అని ఈ సినిమాలో కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. ప్రస్తుతం భారతదేశం పాకిస్థాన్ తో ఉగ్రవాదంతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో చైనా టెక్నాలజీ ఉగ్రవాదాన్ని చూపించారు. కొత్త పాయింట్ అయినా ఇంకాస్త డిటైలింగ్ గా రాసుకుంటే బాగుండేది. సెల్ఫోన్ సిగ్నల్స్ ద్వారా హత్యలు జరగడం ఏంటి అని ఆసక్తి నెలకొంటుంది. లవ్ స్టోరీలు, ట్రావెలింగ్ ఎపిసోడ్స్, కామెడీ సీన్స్ మాత్రం రెగ్యులర్ గా ఉంటాయి. దేశభక్తి మెసేజ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్, దేవుడి సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయ్యాయి.
సాంకేతిక అంశాలు :
సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఇచ్చారు. సాంగ్స్ ఓకే అనిపిస్తాయి. డైరెక్టర్ కొత్త పాయింట్ తీసుకున్న ఇంకాస్త మంచి స్క్రీన్ ప్లే రాసుకొని కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేది. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు. అక్కడక్కడా ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది.
సినిమా ప్లస్ లు :
కొత్త కథ
అక్కడక్కడా కామెడీ
కాస్త సస్పెన్స్
మైనస్ లు :
అక్కడక్కడా ల్యాగ్
రొటీన్ కామెడీ, లవ్ సీన్స్
రేటింగ్ : 2.5/ 5
Also Read : Operation Sindoor : విజయ్ దేవర ‘కొండంత’ మనసు