Ravanasura Review: రావణాసుర రివ్యూ.. రవితేజ హ్యాట్రిక్ హిట్ కొట్టాడా!
- By Balu J Published Date - 01:22 PM, Fri - 7 April 23
రవితేజ అంటే మాస్.. మాస్ అంటే రవితేజ. అలాంటి మాస్ హీరోగా గేర్ మార్చి సస్పెన్స్ మూవీ “రావణాసుర”తో ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఒకవైపు ధమకా, మరోవైపు వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస హిట్స్ సాధించాడు. దీంతో ఆయన నుంచి లేటెస్ట్ మూవీ “రావణాసుర”పై అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన సాలిడ్ థ్రిల్లర్ మూవీ తో రవితేజ అంచనాలు అందుకున్నాడా? హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడా? అనేది తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదువాల్సిందే.
స్టోరీ ఏంటంటే?
ఇక కథలోకి వస్తే.. రవీంద్ర(రవితేజ) కనక మహాలక్ష్మి(ఫరియా అబ్దుల్లా) అనే పేరుమోసిన క్రిమినల్ లాయర్ దగ్గర ఓ జూనియర్ లాయర్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే ఓ రోజు హారిక(మేఘా ఆకాష్) తన తండ్రి (సంపత్ రాజ్) ని ఓ మర్డర్ కేసులో ఎవరో ఇరికించారు అని కనక మహాలక్ష్మి దగ్గరకి వస్తుంది. కానీ హారిక ని చూసిన రవీంద్ర ఆమెని మొదటి చూపు లోనే ఇష్టపడి పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఈ కేసును తాను తీసుకుంటాడు. కానీ ఇక్కడ నుంచి ఈ కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. మరి ఈ మర్డర్స్ చేసింది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఈ కథలో మిగతా హీరోయిన్స్ పాత్రలు ఏంటి? ఆ కిల్లర్ దొరుకుతాడా అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్
ఈ చిత్రంలో బిగ్గెస్ట్ ప్లస్ ఆడియెన్స్ కి బాగా ఆశ్చర్యపరిచే బిగ్ థింగ్ ఏదన్నా ఉంది అంటే అది మాస్ మహారాజ్ రవితేజ సరికొత్త ఊహించని క్యారెక్టరైజేషన్ అని చెప్పాలి. డైరెక్టర్ రాసుకున్న రోల్ కి సినిమా టైటిల్ కి తగ్గట్టుగా ఒక పూర్తిగా కొత్త రవితేజ ని ఈ రావణాసురలో మనం విట్నెస్ చెయ్యొచ్చు. నటన పరంగా తనలోకి కొత్త షెడ్ ని రవితేజ అద్భుతంగా పెర్ఫామ్ చేసి సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తారు.
ఇంతకు ముందు చూడని డాన్సర్ రవితేజ ని కూడా చూడొచ్చు. ఇక కథనంలో కొన్ని ట్విస్ట్ లు మంచి ఆసక్తిగా థ్రిల్ కలిగిస్తాయి. అయితే ఎక్కువ మంది హీరోయిన్స్ ఉన్నారు ఎలా బాలన్స్ చేస్తారు అనే ప్రశ్న చాలా మందికి ఉండొచ్చు కానీ దర్శకుడు ఈ అంశాన్ని బాగా హ్యాండిల్ చేసి అందరికి సమాన ప్రాధాన్యత కలిగిన సీన్స్ లో చూపించాడు. ఫరియా, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్ దక్ష నగర్కార్ అందరికీ మంచి రోల్స్ వారి పరిధిలో మంచి ఎమోషన్స్ తో కూడిన సీన్స్ లో కనిపిస్తారు. ఇక సుశాంత్ కూడా మంచి పాత్రలో కనిపించి ఆకట్టుకుంటాడు. అలాగే వెర్సటైల్ నటుడు రావు రమేష్ సాలిడ్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంటారు. యాక్షన్ బ్లాక్స్ డిజైన్, ఇంటర్వెల్ బ్యాంగ్ లు ఇంప్రెస్ చేస్తాయి.
మైనస్ పాయింట్స్
ఈ చిత్రంలో ఫస్టాఫ్ వరకు అంతా మంచి ఆసక్తిగానే సాగుతుంది కానీ సినిమాకి ఎంతో కీలకమైన సెకండాఫ్ లో మాత్రం ఈ ఫ్లో మరియు ఫ్రెష్ నెస్ కొనసాగదు అని చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్ మిస్ అవ్వడం అలాగే పలు సీన్స్ కాస్త ఓవర్ గా కూడా అనిపిస్తాయి. అలాగే సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ గా చేయాల్సింది. అలాగే మెయిన్ కథలోకి వెళ్ళాక కూడా ప్లాట్ లో పెద్దగా కొత్తదనం కనిపించదు. దీనితో ముందు బాగున్నా నరేషన్ అంతా దీనితో తేలిపోయినట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు కొంచెం కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేది. అలాగే ఒక టైం లో అయితే సినిమాలో పాటలు కూడా అంత ఇంపార్టెంట్ అని కూడా అనిపించదు. మరో ముఖ్య పాయింట్ ఏమిటంటే రవితేజ నుంచి కొన్ని కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ని కోరుకునేవారికి కాస్త నిరాశ తప్పదు.
చివరగా
కమర్శియల్ అంశాలు మిస్ అయినప్పటికీ రవితే అక్కడక్కడ గొప్ప థ్రిల్ ను ఇస్తాడు
Related News
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కెరీర్ ట్రాక్ లో పడేనా.. ?
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో ‘హరి హర వీరమల్లు’, ‘రాజాసాబ్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ ఇద్దరు హీరోలతో నిధికి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. నిధి బ్యాడ్ టైం ఎదుర్కొంటోందని, ఇప్పుడు ఆమె తన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ కు ప్రేమికురాలిగా నటిస్తుండటంతో హరి హర వీరమల్�