Kiran Abbavaram Ka Review & Rating : క రివ్యూ & రేటింగ్
- By Ramesh Published Date - 01:49 PM, Thu - 31 October 24

యువ హీరోల్లో టాలెంట్ ఉన్నా వరుస ఫ్లాపులతో కెరీర్ లో వెనకపడ్డాడు కిరణ్ అబ్బవరం. అందుకే వన్ ఇయర్ బ్రేక్ తర్వాత క తో వస్తున్నాడు. సుజిత్, సందీప్ డైరెక్ట్ చేసిన ఈ క సినిమా నేడు దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
అనాథ అయిన అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథాశ్రమంలో వేరే వాళ్ల ఉత్తరాలు చదివే బలహీనత ఉంటుంది. ఎలాంటి బందాలు లేని అభినయ్ ఈ లెటర్స్ ద్వారానే ఆ అనుబంధాల గురించి తెలుసుకుంటాడు. అదే అలవాటుతోనే పోస్ట్ మ్యాన్ గా మారతాడు. కృష్ణగిరి అనే విలేజ్ లో అతను పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తుంటాడు. ఆ ఊరికి వచ్చే ఉత్తరాలను తెరచి చదివి మళ్లీ యథావిధిగ అంటించి వాళ్లకు ఇస్తాడు. ఐతే ఆ అలవాటులోనే ఊళ్లో అదృశ్యం అవుత్న్న అమ్మాయిల గుట్టు తెలుసుకుంటాడు. అమ్మాయిల మిస్సింగ్ వెనక ఉంది ఎవరు..? వాళ్లను వాసుదేవ్ ఎలా పట్టుకున్నాడు.. ఈ విషయాలు తెలియాలంటే క సినిమా చూడాలి.
విశ్లేషణ :
క లాంటి సినిమా చేస్తున్నప్పుడే అవుట్ మీద ఉన్న నమ్మకంతో తన ప్రతి ప్రెస్ మీట్ లో ఈ సినిమాతో కొడుతున్నాం అని చెప్పాడు కిరణ్ అబ్బవరం. అలానే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేసాడు. ముఖ్యంగా సినిమాకు బలమైన క్లైమాక్స్ లో కేక పెట్టించాడు. తన సినిమాలో ది బెస్ట్ అనిపించేలా.. తెలుగు తెర మీద ఇదివరకు ఎప్పుడు చూడని క్లైమాక్స్ ట్విస్ట్ తో సర్ ప్రైజ్ చేశాడు.
క సినిమా మొదటి పది నిమిషాలు జస్ట్ ఓకే అనిపించినా తర్వాత కథనం కూడా కాస్త మందగించినట్టు అనిపిస్తుంది. ఐతే సెకండ్ హాఫ్ మాత్రం పర్ఫెక్ట్ లైన్ లో వెళ్లింది. ఇక ప్రీ క్లైమాక్స్ వచ్చే సరికి ఆడియన్స్ అంతా అదుర్స్ అనిపించేలా చేసింది. క్లైమాక్స్ లో హీరో ఎలివేషన్ దానికి సిద్ధం చేసుకున్న సీన్స్, బిజిఎం అంతా కూడా అదరగొట్టేసింది.
సినిమాపై కిరణ్ అబ్బవరం ముందు నుంచి ఉన్న కాన్ ఫిడెన్స్ కొంత బజ్ క్రియేట్ చేయగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనని కావాలని కొందరు బ్యాడ్ చేస్తున్నారు అని కిరణ్ ఇచ్చిన స్పీచ్ ఆడియన్స్ ని కదిలించింది. ఫైనల్ గా క తో ఆడియన్స్ కి ఎలాంటి థ్రిల్ ఇస్తే వారు మెచ్చుతారో దాన్ని అందిస్తూ అదరగొట్టాడు. క నిజంగానే ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ తో వచ్చిన సినిమా అని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా సినిమాను తెరకెక్కించారు.
థియేటర్ నుంచి సాటిస్ఫైడ్ గా బయటకు వచ్చేలా క ఉంది. కిరణ్ అబ్బవరం కంటెంట్ ఉన్న సినిమాతో వస్తే కచ్చితంగా అవుట్ పుట్ ఇలా ఉంటుందని ప్రూవ్ చేసుకున్నాడు.
నటన & సాంకేతిక వర్గం :
కిరణ్ అబ్బవరం ఈ సినిమాను చాలా పర్సనల్ గా తీసుకుని చేశాడు. అనుకే ఎక్కడ తగ్గకుండా నటించాడు. తన కెరీర్ స్ట్రాంగ్ చేసుకునేందుకు క లాంటి కంటెంట్ ఉన్న సినిమాలతో కిరణ్ తన స్ట్రెంగ్త్ ఏంటన్నది చూపించాడు. హీరోయిన్ నయన్ సారిక ఇంప్రెస్ చేసింది. మరో ప్రధాన పాత్రలో నటించిన తన్వి రాం కూడా ఆకట్టుకుంది. మిగతా పాత్రదారులంతా కూడా పరిధి మేరకు నటించి మెప్పించారు.
సినిమాకు సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది. కథకు తగినట్టుగా ఆడియన్స్ మైండ్ సెట్ సిద్ధం చేస్తూ కథనం దానికి తగినట్టుగా కెమెరా వర్క్ ఉంది. ఇక మ్యూజిక్ కూడా బిజిఎం ఆకట్టుకుంది. సాంగ్స్ జస్ట్ ఓకే. సుజిత్, సందీప్ దర్శక ద్వయం తొలి సినిమానే అయినా అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
క్లైమాక్స్
బిజిఎం
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ స్లో అవ్వడం
లీడ్ పెయిర్ కెమిస్ట్రీ
బాటం లైన్ :
క.. వర్త్ కిరణ్ వర్తు..!
రేటింగ్ : 3/5