Gopichand Vishwam Review & Rating : గోపీచంద్ విశ్వం రివ్యూ & రేటింగ్
- By Ramesh Published Date - 05:01 PM, Fri - 11 October 24

Gopichand Vishwam Review & Rating మ్యాచో హీరో గోపీచంద్ శ్రీను వైట్ల కాంబోలో భారీ అంచనాలతో వచ్చిన సినిమా విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
సంజయ్ శర్మ అనే మారుపేరుతో ఇండియా లో నివసిస్తున్న జులాలుద్దీన్ ఖురేషి (జ్షు సేన్) విద్యా వ్యవస్థ అనే ముసుగులో స్టూడెంట్స్ ని తీవ్రవాదులుగా మార్చేస్తుంటాడు. వారిని ఉపయోగించుకుని ఇండియాలో మారణహోమం సృష్టించాలని ప్లాన్ చేస్తాడు. ఇందుకు కేంద్ర మంత్రి సీతారామరజు (సుమన్) బ్రదర్ బాచిరాజు (సునీల్) సాయం పొందుతాడు. ఐతే ఉగ్రచర్యల గురించి సీతారామరాజుకి తెలియడంతో తమ్ముడు బాచిరాజుతో సహాయంతో అతన్ని చంపేస్తాడు జులాలుద్దీన్. ఐతే ఈ హత్యను చిన్న పాప చూస్తుంది. దాంతో ఆ పాపను కూడా చంపేయాలని బాచిరాజు కి చెప్పి కశ్మీర్ వెళ్తాడు జులాలుద్దీన్. బాచిరాజు రౌడీలు పాపను చంపబోతే ఆ ఫ్యామిలీకి గోపిరెడ్డిగా పరిచయం ఉన్న విశ్వం (గోపీచంద్) కాపాడుతాడు. పాప ప్రమాదంలో ఉందని గుర్తించి ఆమెకు రక్షణగా ఉంటాడు. ఈ క్రమంలో విశ్వం కు ఎదురైన సవాళ్లు ఏంటి..? అతను పాపను ఎందుకు కాపాడాలనుకున్నాడు..? గోపీరెడ్డి పేరుతో విశ్వం ఏం చేస్తాడు..? జులాలుద్దీన్ ని ఎలా పట్టుకున్నాడు. ఈ కథలో సమైరా (కావ్య థాపర్) ఎవరు..? ఇలాంటి వాటికి సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
శ్రీను వైట్ల సినిమా ఒక థీం బేస్డ్ గా వెళ్తుంటాయి. ఈ విశ్వం లో కూడా దేశాన్ని నాశనం చేయాలనుకునే కొదరి కుట్రల్ని భగ్నం చేయాలనే హీరో మోటో ఉంటుంది. ఇందుకు హీరో మారుపేరుతో ఒక మిషన్ స్టార్ట్ చేయడం లాంటివి చేస్తుంటాడు. ఐతే ఈ కోవలోనే శ్రీను వైట్ల ఇదివరకు సినిమాలు చేశాడు. ఐతే ఇప్పుడు సినిమాలు ప్రేక్షకులు కొత్తదనం కోరుతున్నారు. కానీ విశ్వం కథ రొటీన్ గా అనిపిస్తుంది. ఒక రొటీన్ ఫార్మెట్ కథను అంతే రొటీన్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు.
శ్రెను వైట్ల సూపర్ హిట్ సినిమా దూకుడు తరహాలోనే ఈ విశ్వం సాగుతుంది. విశ్వం సినిమాలో ఒక పాప ఎమోషన్ ను కీలకంగా చూపించారు. మిగతా అంతా కూడా శ్రెను వైట్ల మార్క్ వినోదం అక్కడక్కడ కనిపిస్తుంది. గోపీచంద్ మార్క్ యాక్షన్ కూడా సినిమాలో కొన్ని చోట్ల బాగుంది అనిపిస్తుంది.
ఐతే కథనం ఎలా ఉన్నా కథ కొత్తగా లేకపోవడం వల్ల ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు. అంతేకాదు సినిమా కథ అంతా కూడా ముందే ఊహించేలా ఉండటం కూడా మైనస్ అని చెప్పొచ్చు. కొన్ని బ్లాక్స్ బాగానే ఆసక్తి ఏర్పడేలా చేసినా సరే ఆ తర్వాత సినిమా అంతా ఫ్లాట్ గా సాగిపోతుంది. శ్రీను వైట్ల మార్క్ వినోదం కాస్త వర్క్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ బోర్ కొట్టేలా చేస్తుంది.
ఫస్ట్ హాఫ్ అంతా అలా మొదలై ఇలా అక్కడక్కడ జస్ట్ ఓకే అనిపిస్తూ రాగా సెకండ్ హాఫ్ వచ్చే సరికి గోవా నేపథ్యంతో యాక్షన్ సీన్స్ మెప్పిస్తాయి. సెకండ్ హాఫ్ లో ట్రైన్ కామెడీ సీక్వెన్స్ తో అందరు అనుకున్నట్టుగానే ఆడియన్స్ ని మెప్పించింది. సినిమా క్లైమాక్స్ కూడా ప్రేక్షకుల ఊహకు తగినట్టుగా ఉంటుంది.
నటీనటులు & సాంకేతిక వర్గం :
గోపీచంద్ ఎప్పటిలానే ఇచ్చిన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ లో తన మార్క్ చూపించాడు. ఇక కామెడీ సీక్వెన్స్ లో కూడా మెప్పించాడు. కావ్య థాపర్ తెర మీద తన అందాలతో అలరించింది. డాన్సుల్లో కావ్య మెప్పించింది. జుషు షేన్ గుప్తా విలనిజం ఇంప్రెస్ చేస్తుంది. సునీల్, సుమన్, పృధ్వీ, అజయ్ ఘోష్, వీటీవీ గణేష్ ఇలా అందరు బాగానే చేశారు.
టెక్నిక టీం విషయానికి వస్తే చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎలాంటి అవుట్ పుట్ కావాలో అలా ఇచ్చారు. పీపుల్ మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరెక్టర్ గా శ్రీను వైట్ల ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయారు.
ప్లస్ పాయింట్స్ :
గోపీచంద్
అక్కడక్కడ శ్రీను వైట్ల మార్క్ కామెడీ
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ :
ఊహాజనిత కథ
క్లైమాక్స్
రొటీన్ గా అనిపించడం
బాటం లైన్ : గోపీచంద్ విశ్వం.. మళ్లీ బ్యాడ్ లక్కే..!
రేటింగ్ : 2/5