HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Movie Reviews
  • >Custody First Movie Review

Custody Review: కస్టడీ మూవీ రివ్యూ.. అక్కినేని హీరో హిట్ కొట్టాడా!

  • By Balu J Published Date - 01:17 PM, Fri - 12 May 23
  • daily-hunt
Custody
Custody

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నట వారసుడు నాగచైతన్య (Naga Chaitanya) చివరిసారిగా లవ్ స్టోరీ మూవీతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఈ నేపథ్యంలో తమిళ్ స్టార్ హీరోలతో పనిచేసిన దర్శకుడు వెంకట్ ప్రభు నాగచైతన్య కస్టడీ మూవీని డైరెక్ట్ చేయడంతో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. అరవింద్ స్వామి, శరత్ కుమార్ లాంటి పెద్ద నటులు కూడా  యాక్ట్ చేయడంతో కస్టడీ మూవీ ఆసక్తిని నెలకొల్పింది. ఈ మూవీ ఎలా ఉంది? నాగచైతన్య కు మళ్లీ హిట్ కొట్టాడా? అనేది తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదువాల్సిందే.

శివ (నాగ చైతన్య) ఒక సిన్సియర్ కానిస్టేబుల్. డ్యూటీ అంటే ప్రాణం పెడతాడు. మరోవైపు రేవతి (కృతి శెట్టి) తో ప్రేమలో ఉంటాడు. రేవతి కూడా శివని ప్రాణంగా ప్రేమిస్తోంది. అయితే, కులాలు వేరు కావడంతో రేవతి ఇంట్లో శివతో పెళ్లికి ఒప్పుకోరు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజు (అరవింద్ స్వామి), సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్)ను అరెస్ట్ చేసి స్టేషనుకు తీసుకొస్తాడు శివ. మరోవైపు రాజును చంపాడనికి పోలీస్ కమీషనర్ నటరాజన్ (శరత్ కుమార్) సహా ఏకంగా పోలీస్ ఫోర్స్, రౌడీలు రంగంలోకి దిగుతారు. అసలు ఈ రాజు ఎవరు? రాజును ఎలాగైనా సిబిఐ కి అప్పగించాలని శివ (Shiva) ఎందుకు బలంగా ప్రయత్నం చేస్తాడు ?, ఈ ప్రయాణంలో శివకి ఎదురైన సవాళ్లు ఏమిటి? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్

నాగచైతన్య తన కెరీర్ లో ఒక ఛాలెంజ్ గా (Custody) సినిమాలోని శివ పాత్రలో నటించాడు. పైగా తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో నాచైతన్య చాలా సెటిల్డ్ గా నటించాడు. ఇటు హీరోయిన్ కృతి శెట్టి తో ప్రేమ సన్నివేశాల్లో గాని, అటు యాక్షన్ సన్నివేశాల్లో గాని నాగచైతన్య నటన బాగుంది. హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు, ఆమె నటన బాగుంది.

ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ అరవింద్ స్వామి. నమ్మిందే న్యాయం అనుకుని అతని చేసే క్రైమ్ లో కూడా కామెడీ పడిస్తూ అరవింద్ స్వామి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అరవింద్ స్వామి పలికిన కొన్ని డైలాగ్స్ కూడా పేలాయి. పోలీస్ కమీషనర్ నటరాజన్ గా శరత్ కుమార్ నటన బాగుంది. అలాగే ప్రియమణి, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని కీలక (Scenes) సన్నివేశలను దర్శకుడు వెంకట్ ప్రభు చాలా బాగా తెరకెక్కించాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ తో పాటు చేజింగ్ సీన్స్ ను, పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది.

మైనస్ పాయింట్స్

కస్టడీ లో మెయిన్ కంటెంట్ అండ్ పాయింట్ బాగున్నా.. ట్రీట్మెంట్ విషయంలో కొన్ని చోట్ల స్లో అనిపించింది. దీనికితోడు దర్శకుడు వెంకట్ ప్రభు సెకండ్ హాఫ్ కథనం విషయంలో రాజీపడకుండా ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్ లో సినిమా జరుగుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు వెంకట్ ప్రభు ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు.

అలాగే సెకండ్ హాఫ్ ను కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం చేశారు గాని, కొన్ని చోట్ల అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. అలాగే చాలా చోట్ల లాజిక్స్ కూడా లేకుండా ప్లేను డ్రైవ్ చేశారు. దీనికి తోడు కథ కూడా సింపుల్ గా ఉండటం, చివరకు ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులకు ముందే అర్థం అయిపోతుండటంతో సినిమాలో ఇంట్రెస్ట్ మిస్ అయింది.

టెక్నికల్ గా

మంచి పాయింట్ ను తీసుకున్నా.. ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో, దాన్ని ఇంకా ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో వెంకట్ ప్రభు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే, ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక టీమ్ పనితనం బాగుంది. సన్నివేశాలకు అనుగుణంగా సాంకేతిక వర్క్ సాగింది. సంగీత దర్శకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం బాగుంది. ఎస్ఆర్ కతీర్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ కూడా మెచ్చుకునేలా సాగింది. ఎక్కడా బ్యూటీ తగ్గకుండా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు ఆయన. శ్రీనివాస చిట్టూరి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

బాటమ్ లైన్

మొత్తం మీద సినిమాలో ఫ్లాస్ ఉన్నాయి, కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్టాఫ్ వరకు బాగున్నా సెకెండ్ ఆఫ్ బోర్ సీన్స్ ని బరించగలిగితే ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది కస్టడీ

పంచ్ లైన్

కొంచెం కష్టమైనా కస్టడీ చూడొచ్చు

రేటింగ్ : 2.5/5


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • akkineni nagarjuna
  • Custody
  • kriti shetty
  • Movie Review

Related News

Andhra King

Andhra King Taluka Review : రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రివ్యూ!

దండలు, అగరబొత్తులు, కొబ్బరికాయలు, పాలాభిషేకాలు, విజిల్స్, క్లాప్స్.. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక వీరాభిమాని బుర్రలో ఇవి తప్ప ఇంకేం ఉండవ్. సినిమాకి హిట్ టాక్ వస్తే జేబులో డబ్బులు తీసి పార్టీలు ఇవ్వడం.. అదే ఫ్లాప్ అని తెలిస్తే బీరు తాగి బాధపడటం.. ఇదే సగటు అభిమాని జీవితం.. అంతేనా!! ఒక్కసారి అభిమానిస్తే జీవితాంతం గుండెల్లో పెట్టుకొని తిరిగే పిచ్చోళ్లయ్యా ఫ్యాన్స

    Latest News

    • Amaravati TTD Temple : కృష్ణమ్మకు నిత్య హారతి.. కళ్లు చెదిరేలా టీటీడీ ఆలయం.. సీఎం చంద్రబాబు ప్లాన్‌ ఇదే!

    • Maoist Sensational Letter: జనవరి 1న అందరం లొంగిపోతాం – మావోయిస్టు పార్టీ

    • Dwaraka Tirumala : ద్వారకాతిరుమలలో అంతరాలయ దర్శనానికి టికెట్

    • Orientia Tsutsugamushi : ఏపీ ప్రజలను వణికిస్తున్న ప్రమాదకర పురుగు..ఇది కుడితే అంతే సంగతి !!

    • IND vs SA : మీరు ఉన్నప్పుడే కదా వైట్‌వాష్ ..అశ్విన్‌కు సునీల్ గవాస్కర్ అదిరిపోయే కౌంటర్!

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd