Donkey Ride : గాడిదలపై కొత్త అల్లుళ్ల ఊరేగింపు.. హోలీ వేళ విచిత్ర ఆచారం
Donkey Ride : హోలీ పండుగను అందరూ ఎంజాయ్ చేస్తారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు.
- By Pasha Published Date - 11:48 AM, Tue - 26 March 24

Donkey Ride : హోలీ పండుగను అందరూ ఎంజాయ్ చేస్తారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. ఇది కామన్.. కానీ ఓ ఊరిలో కొత్త అల్లుళ్లను హోలీ రోజు గాడిదపై ఊరంతా ఊరేగిస్తారు. వాళ్ల మెడలో చెప్పుల దండలు వేస్తారు. ఇంతకీ ఆ వెరైటీ సంప్రదాయాన్ని పాటించే ఊరు ఎక్కడుంది ? ఎందుకా ఆచారాన్ని పాటిస్తారు ? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
మన దేశంలోని చాలా ప్రాంతాల్లో భిన్న విభిన్నమైన ఆచారాలు ఉన్నాయి. ఒక్కో పండుగలో ఒక్కోచోట ఒక్కో రకమైన ఆచారాన్ని పాటిస్తుంటారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా విదా గ్రామంలో ఏటా హోలీ పండుగ రోజున ‘ధూళి వందన్’ అనే ఆచారాన్ని గత 8 దశాబ్దాలుగా ఫాలో అవుతున్నారు. 86 ఏళ్ల క్రితం ఈ గ్రామానికి పెద్దగా ఉన్న ఠాకూర్ ఆనందరావు దేశ్‌ముఖ్ కొత్త అల్లుడు హోలీ రోజున వచ్చినప్పుడు ఈ ఆచారం మొదలైందని స్థానికులు తెలిపారు. ఈ ఆచారంలో భాగంగా ఊరికి చెందిన కొత్త అల్లుళ్లను అందరినీ కలిపి హోలీ రోజున గాడిదలపై(Donkey Ride) కూర్చోబెట్టి గ్రామంలో ఊరేగిస్తారు.
Also Read :Attack On Pak : పాక్ నౌకాదళ స్థావరంపై ఎటాక్.. 12 మంది సైనికులు మృతి
కొత్త అల్లుళ్లను ఊరేగించే క్రమంలో వాళ్ల మెడలో చెప్పుల దండలు వేస్తారు. వారిపై రంగులు, హోలికా దహన బూడిదను చల్లుతారు. ఈ ఊరేగింపులో కొత్త అల్లుళ్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులంతా కులమతాలకు అతీతంగా పాల్గొంటారు. విదా గ్రామం శివారులోని హనుమాన్ ఆలయానికి ఊరేగింపు చేరుకున్న తర్వాత గాడిదపై నుంచి కొత్త అల్లుళ్లను దింపి నుదుటిపై తిలకం దిద్ది కానుకలు ఇస్తారు. ఈ సంవత్సరం హోలీ రోజున (సోమవారం) సంతోష్ జాదవ్ అనే ఒకే ఒక్క కొత్త అల్లుడిని గాడిదపై ఊరేగించారు.