HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >The Tower Of Londons New Raven Master Takes Charge Of The Landmarks Iconic Flock

Tower of London : ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌’.. ‘కాకుల మాస్టర్‌’‌ కథ

Tower of London : ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌’.. బ్రిటన్ రాజధాని లండన్ నగరంలోని థేమ్స్‌ నదీ తీరంలో ఉన్న కోట.

  • By Pasha Published Date - 09:06 AM, Sat - 2 March 24
  • daily-hunt
Tower Of London
Tower Of London

Tower of London : ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌’.. బ్రిటన్ రాజధాని లండన్ నగరంలోని థేమ్స్‌ నదీ తీరంలో ఉన్న కోట. ఈ కోటకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. కింగ్‌ విలియం -1 ఇంగ్లాండును జయించిన తర్వాత 1066 సంవత్సరంలో ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌’‌ కోటను నిర్మించారు. మొదట్లో రాజభవనంగా ఉన్న ఈ కోట.. ఆ తర్వాత జైలుగా మారింది. ఈ కోట సంరక్షణ బాధ్యతను కాకులు చూస్తాయని స్థానికులు నమ్ముతారు. కాకులు ఒకవేళ కోటను వీడి వెళ్లిపోతే.. ఈ  టవర్‌తో పాటు ఇంగ్లాండ్‌ రాజ్యం కూలిపోతుందన్నది లండన్ ప్రజల నమ్మకం.

We’re now on WhatsApp. Click to Join

అందుకే 17వ శతాబ్దంలో పాలకుడిగా ఉన్న కింగ్‌ ఛార్లెస్‌ – 2 ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌’(Tower of London) వద్ద ఎప్పుడూ ఆరు కాకులు ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. గతేడాది కింగ్‌ ఛార్లెస్‌ – 3 పట్టాభిషేకం జరిగాక.. ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌’ వద్ద ఉండాల్సిన కాకుల సంఖ్యను ఏడుకు పెంచారు.  ఈ కాకులు ఎగిరిపోకుండా వాటి రెక్కలను ఎప్పటికప్పుడు అవసరం మేర కత్తిరిస్తుంటారు. నిత్యం వాటికి మాంసాహారం, ఉడికించిన గుడ్లు, బిస్కెట్లు అందిస్తారు. వెటర్నరీ పరీక్షలు కూడా చేయిస్తుంటారు. ఈ టవర్ వద్దనున్న కాకులు రోజంతా హాయిగా తింటూ తిరుగుతాయి. రాత్రివేళలో అవి పంజరాల్లోకి వెళ్లి నిద్రిస్తాయి. ఈ చారిత్రక టవర్‌ను చూసేందుకు ఏటా 30 లక్షల మంది టూరిస్టులు వస్తుంటారు.

Also Read : Womens Day : ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’.. చరిత్ర, 2024 థీమ్ వివరాలివీ

ఇంతకీ ఇప్పుడు ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌’ ప్రస్తావన ఎందుకు వచ్చిందో తెలుసా ? 56 ఏళ్ల రాయల్‌ మెరైన్‌ మాజీ సైనికుడు మైకేల్‌ బార్నీ షాండ్లర్‌‌ను ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌’‌లో  ‘కాకుల మాస్టర్‌’‌గా నియమించారు. ఆయన తన  ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌’‌లోని కాకులకు ఆయన సంరక్షకులుగా ఉంటారు. ఆ కాకులను కాపలా కాస్తూ వాటి యోగక్షేమాలను చూడటమే మైకేల్‌ ఉద్యోగ బాధ్యత. ఈయన కింద మరో నలుగురు సహాయక సిబ్బంది సైతం ఉంటారు.

Also Read : HGCC : ఇక ‘హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌’.. ఎందుకు ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • london
  • Raven Master
  • Tower of London
  • wild life

Related News

CM Chandrababu

CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

దీంతో పాటు మంత్రి నారా లోకేష్ సీఐఐ భాగస్వామ్య సమ్మిట్ విజయవంతం కోసం ఆస్ట్రేలియాలో రోడ్ షోలకు కూడా హాజరుకానున్నారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక దిగ్గజాలను, వాణిజ్యవేత్తలను ఆహ్వానించేందుకు ఆయన ఈ అంతర్జాతీయ వేదికను ఉపయోగించుకుంటారు.

    Latest News

    • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

    • Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • VH Fell Down In Bc Rally : బీసీ బంద్ పాల్గొంటూ కిందపడ్డ వీహెచ్

    • MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత

    • Tata Nexon: బంప‌రాఫ‌ర్‌.. ఈ కారుపై ఏకంగా రూ. 2 ల‌క్ష‌లు త‌గ్గింపు!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd