Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Off-beat News
  • ⁄Nagpur Boy Gets %e2%82%b9 33 Lakh Us Job Loses It When Firm Finds Out Hes 15

Job Offer For 10th Class Student: పదో తరగతి కుర్రాడికి రూ.33 లక్షల జాబ్ ఆఫర్!!

తొలి ప్రయత్నంలోనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన వేదాంత్‌ కు రూ.33 లక్షల ప్యాకేజీతో జాబ్ వచ్చింది.

  • By Hashtag U Updated On - 12:40 PM, Tue - 26 July 22
Job Offer For 10th Class Student: పదో తరగతి కుర్రాడికి రూ.33 లక్షల జాబ్ ఆఫర్!!

తొలి ప్రయత్నంలోనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన వేదాంత్‌ కు రూ.33 లక్షల ప్యాకేజీతో జాబ్ వచ్చింది. కానీ ఇచ్చిన జాబ్ ఆఫర్ ను కంపెనీ వెంటనే వెనక్కి తీసుకుంది. కారణం ఏమిటి .. అనుకుంటున్నారా? అతడి వయసు!! ఔను.. తాము జాబ్ ఆఫర్ చేసిన కుర్రాడి వయసు 15 ఏళ్లేనని తెలియడంతో కంపెనీ వెనక్కి తగ్గింది. ఇంత పెద్ద ప్యాకేజీతో.. ఒక అమెరికా కంపెనీ జాబ్ ఆఫర్ చేసేంతగా వేదాంత్‌ ఏం చేసి ఉంటాడు అనుకుంటున్నారా?

వేదాంత్‌ ఎలా ఎంపికయ్యాడు ?

వేదాంత్ తల్లిదండ్రులు అశ్విని, రాజేశ్ ఇద్దరూ నాగ్‌పూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. వేదాంత్‌ తన తల్లి ల్యాప్‌ టాప్ లో ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తుండగా..అమెరికాలోని న్యూజెర్సీ యాడ్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ కోడింగ్‌ కాంపిటీషన్‌ గురించి తెలుసుకున్నాడు. వెంటనే దానికి దరఖాస్తు చేశాడు. ఆన్‌లైన్‌ కోడింగ్‌ కాంపిటీషన్‌ కోసం కేవలం రెండు రోజుల్లోనే 2,066 లైన్ల ప్రోగ్రామింగ్‌ కోడ్‌ రాశాడు. హెచ్‌టీఎంఎల్‌, జావాస్ర్కిప్ట్‌, వర్చువల్‌ స్టూడియో కోడ్‌(2022)తో కాంపిటీషన్‌లో ప్రోగ్రామింగ్ చేశాడు.దీంతో ఆ అమెరికా కంపెనీలో రూ.33 లక్షల ప్యాకేజీతో వేదాంత్‌ కు జాబ్ వచ్చింది. అయితే, జాబ్‌ ఆఫర్‌ చేసినప్పుడు సంస్థకు వేదాంత్‌ వయస్సు తెలియదు. తర్వాత తెలుసుకొని జాబ్‌ నిరాకరించింది. అయితే పదో క్లాస్ విద్యార్థి అయిన వేదాంత్ నిరుత్సాహపడకుండా ఆ కంపెనీ అతడికి ఓ ఆఫర్ ఇచ్చింది. చదువు పూర్తి చేసుకున్నాక.. తమను సంప్రదించాలని సూచించింది. ‘నీ ఎక్స్‌పీరియన్స్, ప్రొఫెషనలిజం, తీరుతో’తో ఇంప్రెస్ అయ్యామంటూ ఆ సంస్థ వేదాంత్‌కు లేఖ రాసింది.

సొంతంగానే..

వేదాంత్ సొంతంగానే కోడింగ్ నేర్చుకోవడం విశేషం. తన తల్లి ల్యాప్‌టాప్‌ను ఉపయోగించి అతడు కోడింగ్ నేర్చుకున్నాడు. ఆ ల్యాప్‌టాప్ ద్వారా దాదాపు 25 ఆన్‌లైన్ ట్యూటోరియల్స్ చూసిన వేదాంత్.. అవన్నీ స్లోగా ఉన్నాయని.. అవుట్‌డేట్ అయిపోయాయని చెప్పడం గమనార్హం. ‘మా అబ్బాయి కోడింగ్ కాంపీటిషన్‌ల విజేతగా ఎలా నిలిచాడనేది మాకు తెలీదు. వేదాంత్ చదువుకునే స్కూల్ వాళ్లు ఫోన్ చేసి ఈ ఆఫర్ గురించి చెప్పారు’ అని రాజేశ్ తెలిపారు. .

Tags  

  • information technology
  • Nagpur
  • Vedant Deokate

Related News

Hyderabad AIIMS: కోవిడ్ పై ఎయిమ్స్ స్టడీ ఇదే!

Hyderabad AIIMS: కోవిడ్ పై ఎయిమ్స్ స్టడీ ఇదే!

కోవిడ్ తరంగాల ప్రభావంపై ఎయిమ్స్ పరిశోధకుల బృందం చేసిన అధ్యయనంలో భయంకరమైన వాస్తవాలు బయట పడ్డాయి. కోవిడ్ సోకిన వారిలో మతిమరుపు దీర్ఘకాలిక వ్యాధిగా ఉంటుందని తేల్చారు.

    Latest News

    • India vs WI: చివరి టీ ట్వంటీ లోనూ భారత్ గ్రాండ్ విక్టరీ

    • Rohit Sharma: రో’హిట్’…సూపర్‌హిట్

    • CWG Indian Hockey: 16 ఏళ్ళ తర్వాత మహిళల హాకీలో కాంస్యం

    • Fake Tweets: కేశినేని పేరుతో ట్వీట్ల కలకలం…తనవి కావన్న కేశినేని నాని..!!

    • Roja Fire : మామూలు యాంకర్లే కారు కొంటున్నారు…నేను కొంటే తప్పేంటీ..?

    Trending

      • AP Pvt Medical Colleges: ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజులుం

      • Sausage Star: కొత్త నక్షత్రం అంటూ ఫోటో షేర్ చేసిన శాస్త్రవెత్త.. తీరా అదేంటని చూస్తే?

      • Aadhar Card: కార్డులో ఇలా ఈజీగా డేట్ అఫ్ బర్త్ మార్చుకోండి.. పూర్తి వివరాలివే!

      • Friendship Day: ఫ్రెండ్ షిప్ డేను అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

      • Mosquitoes Issue: వర్షాకాలంలో ఈగలు, దోమల బాధపడలేకపోతున్నారా..అయితే శాశ్వతంగా తరిమేసే చిట్కాలివిగో..

    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    • Copyright © 2022 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam
    • Follow us on: