Naatu Naatu: ఢిల్లీని ఊపేస్తున్న ‘నాటు నాటు’.. చక్కర్లు కొడుతున్న వీడియో!
ఢిల్లీలో జర్మనీ, ఇండియా సిబ్బంది కలసి నాటు నాటు పాటకు అదిరిపొయే డాన్స్ చేశారు. క్రేజీ స్టెప్పులతో దుమ్మురేపారు.
- By Balu J Published Date - 11:19 AM, Mon - 20 March 23

ఆస్కార్ అవార్డుల సెలబ్రేషన్స్ ముగిసినా నాటు నాటు క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. గల్లీ టు ఢిల్లీ, హైదరాబాద్ టు యూఎస్ అనే తేడా లేకుండా ప్రతిఒక్కరినీ ఎంటర్ టైన్ చేస్తోంది. నాటు నాటు పాట, అందులోని స్టెప్పులు, లిరిక్స్ కు చాలామందిని ఉర్రూతలూగిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జరిగిన ప్రదర్శన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే నాటు నాటు సాంగ్ క్రేజ్ ఇంకా ఆగలేదు అని అనిపిస్తోది. ఢిల్లీ చాందిని చౌక్ వద్ద ఈ పాటకి డ్యాన్స్ చేశారు జర్మనీ ఎంబసీ సిబ్బంది. జర్మనీ ఎంబసీ ట్విట్టర్ లో ఈ వీడియో పోస్ట్ చేసింది. ఎంబసీలో ఉన్న జర్మనీ, ఇండియా సిబ్బంది కలసి ఈ డ్యాన్స్ వీడియో చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. మీరు కూడా ఓ లుక్ వేయ్యండి.