Wheelchair Food Delivery Video: వీల్ చైర్ పై ఫుడ్ డెలివరీ.. హ్యాట్సాప్ అంటున్న నెటిజన్స్!
జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, అవమానాలు తెలియకుండానే కొత్త విషయాలను నేర్పిస్తారు.
- By Balu J Updated On - 03:06 PM, Thu - 28 July 22

జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, అవమానాలు తెలియకుండానే కొత్త విషయాలను నేర్పిస్తారు. మనకో దారిని చూపుతాయి. వికలాంగులు అంటే కొంతమందికి చిన్నచూపు. కానీ ఆ పదానికి అర్థమే మార్చేస్తున్నారు ఈ తరం వికలాంగులు. వైకల్యాన్ని అడ్డుగా చూపి ఇంట్లోనే కూర్చోకుండా తమకు నచ్చిన పనులు చేసుకుంటున్నారు. సాధ్యం కాని పనులు చేసుకుంటూ ఔరా అనిపిస్తున్నారు. ఇటీవల ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వైకల్యంతో బాధపడే ఓ వ్యక్తి వీల్ చైర్ పై ఫుడ్ డెలివరీ చేస్తూ అందరి మనసులను దోచుకున్నాడు. భుజాన బ్యాగ్ వేసుకొని వీల్ చైర్ పై ( ప్రత్యేక వాహనం) రోడ్డుపై దూసుకుపోతున్న వీడియో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. కొన్ని వారాల క్రితం గ్రూమింగ్ బుల్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయడంతో వైరల్ గా మారింది. తలుచుకుంటే సాధ్యంకానిది ఏదీ ఉండదు అని కొందరు, యూఆర్ గ్రేట్ ఇంకొందరు, శభాష్ అని మరికొందరు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Related News

Odisa Story: వరదనీటిలో మృతదేహానికి అంత్యక్రియలు..ఎక్కడో తెలుసా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుంభకోత వర్షాలు వస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.