Snake : సైకిల్ క్యారియర్‌లో పాము
Snake : ఈ పాము చివరికి బైక్‌పై ఉన్న ఓ వ్యక్తిపై ఎగబడే ప్రయత్నం చేయగా, అతడు సమయస్ఫూర్తితో వెంటనే బైక్ దిగిపోవడం వల్ల ప్రమాదం తప్పింది
- By Sudheer Published Date - 04:02 PM, Sat - 24 May 25

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో విచిత్రమైన, ఉలిక్కిపడే వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ భయానక సంఘటనతో కూడిన వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి సైకిల్ తొక్కుతుండగా, ఆ సైకిల్ క్యారియర్(Bicycle )లో ఓ భారీ పాము (Snake ) చిక్కుకొని ఉండటం కనిపిస్తుంది. సైకిల్ కదిలే కొద్దీ ఆ పాము కూడా కదులుతూ భయానకంగా కనిపిస్తోంది. మొదట క్యారియర్‌లో ఉన్న పాము తరువాత సీటుపైకి చేరడం, చివరికి రోడ్డుపైకి జారిపోవడం ఈ సంఘటనను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.
ఈ పాము చివరికి బైక్‌పై ఉన్న ఓ వ్యక్తిపై ఎగబడే ప్రయత్నం చేయగా, అతడు సమయస్ఫూర్తితో వెంటనే బైక్ దిగిపోవడం వల్ల ప్రమాదం తప్పింది. ఆ తర్వాత పాము చెట్లవైపు పరుగెత్తింది. ఈ దృశ్యాలను చూసినవారు ఊపిరిపీల్చలేనంతగా ఉలిక్కిపడ్డారు. వీడియోలో పాము పొడవు, కదలికలు చూసినవారు ఇది ధోడియా పాముగా భావిస్తూ, ఇది విషపూరితమైనది కాకపోయినా, భయానికి మాత్రం కొదవ లేదని అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పటికే 4.8 కోట్ల మందికి పైగా వీక్షించగా, లక్షల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు జరగడం అనూహ్యమేమీ కాదు కానీ, ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. సైకిల్ లేదా బైక్ తొక్కుతున్నప్పుడు వెనక్కి ఓసారి చూసుకోవడం మంచిదని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు.