Electricity Bill : కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందా..? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాల తగ్గుద్ది ..!!
Electricity Bill : ఇన్వర్టర్ ఏసీ వాడకం కూడా విద్యుత్ ఆదాలో కీలక పాత్ర పోషిస్తుంది. వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ ఫీచర్‌తో పనిచేసే ఇన్వర్టర్ ఏసీలు అవసరమైన ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా మేనేజ్ చేస్తాయి
- By Sudheer Published Date - 04:20 PM, Sun - 8 June 25

ప్రతి నెల ప్రారంభంలో వచ్చే కరెంట్ బిల్లు (Electricity Bill) చూసి చాలామంది ఆందోళన చెందుతుంటారు. అయితే కొన్ని సాధారణమైన జాగ్రత్తలు పాటించటం ద్వారా విద్యుత్తును ఆదా చేయడం, తక్కువ బిల్లుతో సమర్థవంతంగా జీవించడాన్ని సాధించవచ్చు. ముఖ్యంగా అవసరం లేనప్పుడు ఫ్యాన్‌లు, లైట్లు ఆఫ్ చేయడం వంటి చిన్న చిన్న చర్యలే పెద్ద మార్పు తేవచ్చు.
ఇన్వర్టర్ ఏసీ వాడకం కూడా విద్యుత్ ఆదాలో కీలక పాత్ర పోషిస్తుంది. వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ ఫీచర్‌తో పనిచేసే ఇన్వర్టర్ ఏసీలు అవసరమైన ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా మేనేజ్ చేస్తాయి. దీంతో తరచూ ఆన్, ఆఫ్ చేయాల్సిన అవసరం లేకుండా తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. మరింత ఆదా కోసం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) 5-స్టార్ రేటింగ్ ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడం ఉత్తమం.
New Cabinet : కొత్త మంత్రులకు అప్పగించే శాఖలు ఇవేనా?
అదేవిధంగా పాత ట్యూబ్‌లైట్లు, బల్బులు బదులుగా LED లైట్లు, 5-స్టార్ రేటింగ్ గల ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్‌ల వాడకం ద్వారా విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గుతుంది. కిచెన్ అప్లయిన్సెస్‌ను వాడిన తర్వాత మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం, ఛార్జర్లు, టీవీ వంటి డివైస్‌లను స్టాండ్‌బై మోడ్‌లో ఉంచకుండా స్విచ్ ఆఫ్ చేయడం వల్ల కూడా విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవింగ్ సాధించడం సాధ్యమవుతుంది.