BioMass : బయో మాస్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసే టెక్నాలజీ.. భారత సైంటిస్టుల ఆవిష్కరణ
బయో మాస్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ ను తయారు చేసే సరికొత్త టెక్నాలజీని బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
- By Hashtag U Published Date - 06:00 PM, Wed - 13 July 22
బయో మాస్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ ను తయారు చేసే సరికొత్త టెక్నాలజీని బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇండియా లో ఏటా వివిధ రంగాల కార్యకలాపాల్లో దాదాపు 50 లక్షల టన్నుల హైడ్రోజన్ ను వినియోగిస్తున్నారు. శిలాజ ఇంధనాలను స్టీమ్ మీథేన్ రిఫామింగ్ పద్దతిలో ప్రాసెసింగ్ చేసి ఈ హైడ్రోజన్ ను సేకరిస్తున్నారు. ఫలితంగా వాతావరణ కాలుష్యం కమ్ముకుంటోంది. దీనికి కట్టడి వేసేదే గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్ ను బయో మాస్ ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి ప్రక్రియ తొలి స్టేజిలో బయో మాస్ ను ప్రత్యేక రియాక్టర్ ద్వారా సింగాస్ రూపంలోకి మారుస్తారు. రెండో స్టేజిలో సింగాస్ నుంచి స్వచ్ఛమైన హైడ్రోజన్ ను సేకరిస్తారు. ఇందుకోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు లో ప్రెషర్ గ్యాస్ సెపరేషన్ యూనిట్ ను అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ ను ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకుడు ఎస్.దాసప్ప నేతృత్వంలోని సైంటిస్టుల టీమ్ తయారు చేసింది. 1 కేజీ బయో మాస్ నుంచి 100 గ్రాముల గ్రీన్ హైడ్రోజన్ ను తయారు చేయడం ఈ పద్ధతి ప్రత్యేకత. ఈ విధానంలో గ్రీన్ హైడ్రోజన్ తయారీ వల్ల పర్యావరణ కాలుష్యానికి కూడా ఆస్కారం ఉండదు. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం, పునరుత్పాదక ఇంధన వనరుల విభాగం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారం తో ఈ రీసెర్చ్ ప్రాజెక్టు జరిగింది. హైడ్రోజన్ ఫ్యూల్ సెల్స్ తో నడిచే బస్సులకు కోసం ప్రతిరోజు 0.25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ను అందించే టెక్నాలజీ అభివృద్ధి పై శాస్త్రవేత్తల టీమ్ పనిచేస్తోంది.
Related News
Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!
యవ్వనాన్ని పొడిగించడానికి, లైఫ్ టైం ను పెంచడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు.