Hyundai Exter Micro SUV : ఆ కారు కావాలంటే 9 నెలలు వెయిట్ చేయాల్సిందే..!
హ్యుండై ఎక్స్ టర్ మైక్రో ఎస్.యు.వి (Hyundai Exter Micro SUV)ని కొన్ని నెలల క్రితం రిలీజ్ చేశారు
- By Ramesh Published Date - 11:21 PM, Sun - 1 October 23

హ్యుండై నుంచి సరికొత్త మోడల్ హ్యుండై ఎక్స్ టర్ మైక్రో ఎస్.యు.వి (Hyundai Exter Micro SUV)ని కొన్ని నెలల క్రితం రిలీజ్ చేశారు. మార్కెట్ లోకి రిలీజైన నాటి నుంచి ఈ కారు ఆకట్టుకుంటుంది. కారు డిజైన్, ధర, ఫీచర్లు అన్నీ ఆకర్షణీయంగా ఉన్నాయి. అందుకే ఈ కారు మార్కెట్ లో భారీ డిమాండ్ ఏర్పడింది.
డిమాండ్ పెరగడం వల్ల బుకింగ్ చేసుకున్న కస్టమర్స్ కి వెయిటింగ్ పీరియడ్ కూడా పెరుగుతుంది. హ్యుందై ఎక్స్ టర్ మైక్రో ఎస్.యు.వి బుకింగ్ మొదలైన నెల లోనే 50,000 పైన బుకింగ్స్ వచ్చాయి. ఇప్పటికే ఈ ఆర్డర్స్ 75 వేల దాకా వెళ్లాయి. Hyundai కార్ల డిమాండ్ మేరకు ఎక్స్ టర్ కార్ల ఉత్పత్తిని 30 శాతం పెంచింది. హ్యుండై ఎక్స్ టర్ కారు పెట్రోల్, సీ.ఎన్.జి వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
ఇక ఈ Hyundai Exter కారు ప్రారంభ ధర 5,99,900 రూ.ల ఎక్స్ షోరూం ప్రైజ్ కలిగింది. ఈ కారు ఈ.ఎక్స్, ఎస్, ఎస్.ఎక్స్, ఎస్.ఎక్స్(ఓ) వేరియంట్లలో ఉంటుంది. ఎంట్రీ లెవెల్ మోడళ్లకు 9 నెలలు వెయిటింగ్ పీరియడ్ చెబుతున్నారు. హ్యుందై ఎక్స్ టర్ కారు 4 సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది.
ఎక్స్ టర్ పెట్రోల్ ఇంజిన్ 81.8 బీ.హెచ్.పి శక్తి, 113 ఎన్.ఎం టార్క్ ను కలిగి ఉంటుంది. సీ.ఎన్.జి వెర్షన్ లో 67.7 బీ.హెచ్.పి పవర్, 95.2 ఎన్.ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఇదే కాదు ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏ.ఎం.టి గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఎక్స్‌టర్ పెట్రోల్ వెర్షన్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో అయితే 19.4 కె.ఎం.పి.ఎల్ మైలేజీ ఇస్తుంది. అదే ఆటోమేటిక్ టాన్స్‌మిషన్ వేరియంట్ 19.2 కె.ఎం.పి.ఎల్ మైలేజీ ఇస్తుంది.
సి.ఎన్.జి వేరియంట్ 27.1 కె.ఎం.పి.ఎల్ మైలేజీ అందిస్తుంది. ఇవేకాకుండా ఎలక్ట్రిక్ సన్ రూఫ్, బ్యాక్ సైడ్ ఏసీ వెంట్, పుష్ బటన్ స్టార్ట్, డ్రైవర్ ప్యాసింజర్ సహా సైడ్ ఎయిర్ బ్యాగ్స్ లు మొత్తం 6 ఎయిర్ బ్యాగ్ బ్యాగ్స్ కలిగి ఉంటుంది. హ్యుండై ఎక్స్ టర్ మైక్రో ఎస్.యు.వి బేస్ వేరియంట్ ఈ.ఎక్స్ ధర 5.99 లక్షలు ఉంది. ఎక్స్ ఓ ధర 6.25 లక్షలు, ఎస్ ధర 7.27 లక్షలు, ఎస్ ఓ ధర 7.42 లక్షలు కలిగి ఉంది.
Also Read : Bigg Boss 7 : రతిక ఎలిమినేషన్ ట్విస్ట్ అదేనా..!
Related News

Hyundai Exter: హ్యుందాయ్ నుంచి SUV Xeter విడుదల.. ఈ కారు ధర ఎంతంటే..?
ఇటీవల హ్యుందాయ్ మోటార్ భారతదేశంలో తన అతి చిన్న SUV Xeter (Hyundai Exter)ను విడుదల చేసింది. ఈ కారులో అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు ఇవ్వబడ్డాయి.