Bigg Boss 7 : రతిక ఎలిమినేషన్ ట్విస్ట్ అదేనా..!
బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) నాలుగో వారం రతిక ఎలిమినేట్ అయ్యింది. తేజ, రతిక ఇద్దరు లీస్ట్ ఓటింగ్ తో చివరి దాకా వెళ్లగా రతిక
- Author : Ramesh
Date : 01-10-2023 - 10:54 IST
Published By : Hashtagu Telugu Desk
బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) నాలుగో వారం రతిక ఎలిమినేట్ అయ్యింది. తేజ, రతిక ఇద్దరు లీస్ట్ ఓటింగ్ తో చివరి దాకా వెళ్లగా రతిక ని ఎలిమినేట్ అంటూ నాగార్జున చెప్పారు. వీకెండ్ ఎపిసోడ్ లో ఎప్పటిలానే సండే ఫన్ డే అంటూ ఆట పాటలతో సాగగా ఆరుగురు కంటెస్టెంట్స్ నుంచి ఒక్కొక్కరిని సేఫ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్ గా రతికని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్.
మొదటి వారం దూకుడిగా కనిపించిన రతిక (Rathika) రెండో వారం లో ఒక టాస్క్ విషయంలో తన టీం మెంబర్స్ ని ఇబ్బంది పెట్టింది. అంతేకాదు మొన్నటిదాకా పల్లవి ప్రశాంత్, యావర్ లను తన స్నేహితులుగా చూసింది. అయితే ఆ తర్వాత అమర్ దీప్ తో కలిసి ఆట ఆడాలని చూసింది. ఇక టాస్కుల్లో కూడా పెద్దగా పర్ఫాం చేయకుండా హౌస్ మెట్స్ మధ్యలో మైండ్ గేం ఆడాలని చూసిన రతికని ఫైనల్ గా ఆడియన్స్ ఇంటి నుంచి బయటకు పంపించారు.
హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ విషయంలో ఆడియన్స్ కొందరు ప్రత్యేకమైన అభిప్రాయలతో ఉంటారు. కానీ ఈ వారం రతికని హౌస్ నుంచి బయటకు పంపించాలని మెజారిటీ ఆడియన్స్ కామెంట్ చేశారు. ఓ పక్క హౌస్ లో తన ఎక్స్ గుర్తొస్తున్నాడు అంటూ రతిక చేసిన కామెంట్స్ కి రివర్స్ కౌంటర్ గా రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) తన సోషల్ మీడియాలో తన పేరుని వాడుకుని హౌస్ లో ఆడుతున్నారని చెప్పాడు.
రతిక బిహేవియర్ కూడా హౌస్ లో డిఫరెంట్ గా అనిపించడం వల్ల ఆడియన్స్ అంతా ఆమె బయటకు వెళ్లాలని కోరుకున్నారు. మొత్తానికి 14 మందితో మొదలైన ఈ బిగ్ బాస్ (Bigg Boss) సెవెంత్ సీజన్ రతిక ఎలిమినేషన్ తో 10 మంది అయ్యారు. అయితే ఆదివారం ఎపిసోడ్ ఎండింగ్ లో ఉల్టా పుల్టా ఏదైనా జరగొచ్చని మెలిక పెట్టాడు. మరి అసలు బిగ్ బాస్ ప్లాన్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.
Also Read : SBI Annuity Deposit Scheme : ప్రతినెల ఆదాయం వచ్చే ఎస్బీఐ ఈ స్కీం గురించి తెలుసా..?