PM Kisan 12th Installment : రైతులకు శుభవార్త…ఈ తేదీల్లో అకౌంట్లోకి 12 విడత డబ్బులు..!!
పీఎం కిసాన్ 12 వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. 12వ విడత డబ్బులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది.
- By hashtagu Published Date - 01:24 PM, Wed - 28 September 22
పీఎం కిసాన్ 12 వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. 12వ విడత డబ్బులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్దిష్ట తేదీని ప్రకటించనప్పటికీ, ఇప్పటి వరకు ఉన్న ట్రాక్ రికార్డును పరిశీలిస్తే, ప్రభుత్వం ఎప్పుడైనా ప్రకటించవచ్చే అవకాశాలు ఉన్నాయి. పీఎం కిసాన్ లబ్ధిదారుల ఖాతాలో ఎప్పుడైనా డబ్బులు పడే అవకాశం ఉంది. KYC పూర్తి చేసిన వారికి మాత్రమే అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. మీరు మీ KYC లేదా e-KYC చేయకుంటే మీ ఇన్స్టాల్మెంట్ నిలిచిపోయే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో, మీరు PM కిసాన్ యోజన 12వ విడత డబ్బు మీ అకౌంట్లో జమ కాదు. కేంద్రం ఇప్పటికే 11 వాయిదాలను అకౌంట్లో జమ చేసిన సంగతి తెలిసిందే.
PM కిసాన్ వాయిదాను ఎలా తనిఖీ చేయాలి
-పీఎం కిసాన్ వాయిదాను చెక్ చేసుకోవడానికి PM కిసాన్ వెబ్సైట్ https://pmkisan.gov.in/కి వెళ్లండి.
-పేజీకి కుడి వైపున ఉన్న ‘బెనిఫిషియరీ స్టేటస్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
-ఇక్కడ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్‌ను ఎంటర్ చేయండి.
-ఆ తర్వాత ‘గెట్ డేటా’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
-ఇప్పుడు లబ్ధిదారుని వివరాలు కనిపిస్తాయి.
-ఇక్కడ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూడండి.
PM కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా తనిఖీ చేయాలి?
-PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి- https://pmkisan.gov.in/.
-పేజీ కుడి మూలన ఉన్న ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
-డ్రాప్ డౌన్ నుండి రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్ గ్రామం వంటి వివరాలను ఎంచుకోండి.
-తర్వాత ‘గెట్ రిపోర్ట్’పై క్లిక్ చేయండి.
-దానిపై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా వివరాలు కనిపిస్తాయి.
– మరిన్ని వివరాల కోసం మీరు ఈ PM-కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 155261/011-24300606కు కాల్ చేయవచ్చు.
Related News
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు..! ఎప్పుడంటే..?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత 2024కి ఇంకా తేదీ నిర్ణయించబడలేదు.