Viral Video : పెళ్లిలో చీరకట్టులో పురుషుల సందడి…ముక్కునవేలేసుకున్న జనాలు..!!
- By hashtagu Published Date - 07:53 PM, Tue - 15 November 22

ట్రెండ్ మారుతోంది. యువత కొత్తదనం కోరుకుంటున్నారు. పెళ్లికి సాధారణంగా అబ్బాయిలు షేర్వానీ కుర్తా సూట్ ఇలా ధరిస్తుంటారు. కానీ చికాగోలో జరిగిన ఈ వింతను చూస్తే మీరు నవ్వుకుంటారు. ఏంటాది అనుకుంటున్నారా? భారతీయ స్నేహితుడి వివాహానికి విదేశీ స్నేహితులు ఇద్దరు చీరకట్టులో వచ్చారు. వయ్యారాలు ఒలకబోస్తూ నడుస్తుంటే…వీరిని చూసినవాళ్లంతా నవ్వు ఆపుకోలేకపోయారు.
కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అవుతోంది. లింగనిర్ధారణతో కూడిన దుస్తులకు సంబంధించిన మూస పద్ధతిని బద్దలు కొట్టేందుకు ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. భారతీయ వస్త్రధారణలో తన స్నేహితులను చూసి వరుడు ఆశ్చర్యపోయాడు. ఇండియన్ లుక్ విదేశీయులు చాలా ట్రెండీగా కనిపించారు. చీరకట్టులో ఉన్న స్నేహితులను చూసిన పెళ్లికొడుకు నవ్వును అదుపు చేసుకోలేకపోయాడు.
ఈ వీడియోను ‘చికాగో వెడ్డింగ్ వీడియోగ్రాఫర్’ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇండియన్ ఫ్రెండ్ కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు షేర్వానీ, కుర్తా లేదా సూట్ కు బదులుగా చీరను సెలక్ట్ చేసుకున్నారు. ఈ డిఫరెంట్ ఐడియా చాలామందికి నచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Related News

Viral Video : ముగ్గురు దుండగులు.. పట్టపగలు ఫైరింగ్.. కర్ణిసేన చీఫ్ మర్డర్
Viral Video : సుఖ్దేవ్ సింగ్ గోగమేడి.. రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధినేత.