Elon Musk: ఎలన్ మస్క్ పక్కలో రెండు పిస్టల్స్ పెట్టుకోని నిద్రపోతాడట…ఎందుకో తెలుసా..?
- Author : hashtagu
Date : 29-11-2022 - 6:52 IST
Published By : Hashtagu Telugu Desk
ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలన్ మస్క్ ఏదొక వార్తను పోస్టు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన ట్వీట్లకు జనాలు కూడా ఘాటుగానే స్పందిస్తుంటారు. సోమవారం కూడా ఎలన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చాలా ఆశ్యర్యంగా ఉంది. రోజూ రెండు తుపాకులతో నిద్రపోతానని..డైట్ కోట్ డబ్బాల సేకరణ తన వద్ద ఉందని మస్క్ వెల్లడించారు. మస్క్ తన డెస్క్ వెనుక నుంచి తీసిన ఒక ఫోటోను షేర్ చేశాడు. అందులో రెండు రివాల్వర్లు ఉన్నాయి. వీటిలో ఒకటి సినిమా ప్రాప్ లాంటిది కాగా…మరోకటి 19వ శతాబ్దానికి చెందినది. వీటితోపాటు అక్కడ అనేక ఆహారపదార్థాలు కూడా ఉన్నాయి.
My bedside table pic.twitter.com/sIdRYJcLTK
— Elon Musk (@elonmusk) November 28, 2022
మస్క్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దాదాపు 70వేల మంది దీని లైక్ చేసి రీట్వీట్ చేశారు. అంతేకాదు పెద్దెత్తున కామెంట్లు పెట్టారు. ఒక నెటిజన్ మస్క్ ను అడుగుతూ..మీరు తుపాకీ కల్చర్ కు సపోర్టు చేస్తున్నారా అంటూ ప్రశ్నించాడు. మీరు మానవత్వం, శాంతికి అనుకూలంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అంటూ రీట్వీట్ చేశాడు. మరో నెటిజన్ కోక్ నిజంగా ఆరోగ్యానికి మంచిది కాదంటూ రీట్వీట్ చేశాడు. మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఇలాంటి పోస్టు పెడుతూనే ఉన్నారు.