Fifth Marriage : మర్దోక్ పెళ్లికొడుకాయెనె.. 93 ఏళ్ల ఏజ్‌లో ఐదో పెళ్లి.. ఎవరితో ?
Fifth Marriage : రూపర్ట్ మర్దోక్.. అపర కుబేరుడు. ఆయనకు దాదాపు రూ.లక్ష కోట్ల ఆస్తులున్నాయి.
- By Pasha Published Date - 03:33 PM, Fri - 8 March 24
Fifth Marriage : రూపర్ట్ మర్దోక్.. అపర కుబేరుడు. ఆయనకు దాదాపు రూ.లక్ష కోట్ల ఆస్తులున్నాయి. ప్రస్తుతం మర్దోక్ వయసు 93 ఏళ్లు. ఈ ఏజ్‌లోనూ ఆయన పెళ్లిళ్లను ఆపడం లేదు. ఇప్పటికే ఆయనకు నాలుగుసార్లు పెళ్లయింది. ప్రముఖ ఆస్ట్రేలియన్ – అమెరికన్ వ్యాపారవేత్త అయిన మర్దోక్ ఇప్పుడు ఐదో పెళ్లికి(Fifth Marriage) రెడీ అయ్యారట. ఈ ఏడాది జూన్‌లో ఆయన తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాతో ఎంగేజ్మెంట్ చేసుకుంటారని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాలిఫోర్నియాలోని మర్దోక్ ఎస్టేట్‌లో ఈ పెళ్లి జరుగుతుందట. ఇప్పటికే కొంతమందికి మర్దోక్ ఆహ్వానాలు కూడా పంపారట.
We’re now on WhatsApp. Click to Join
- మర్దోక్‌కు త్వరలో జరగబోయేది ఐదో పెళ్లి. కానీ ఎంగేజ్మెంట్ మాత్రం ఆరోది.
- గతేడాది ఆన్ లెస్లీ స్మిత్‌తో మర్దోక్ ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ.. నెల రోజుల్లోనే ఆ బంధానికి తెరపడింది.
- ఆ తర్వాత కొన్ని నెలలకు తన మాజీ భార్యల్లో ఒకరైన విన్‌డీ డెంగ్ ఇచ్చిన పార్టీలో మర్దోక్‌కు రష్యాకు చెందిన జుకోవా అనే మహిళ పరిచయమయ్యారు.
- అప్పటి నుంచి జుకోవాతో మర్దోక్ డేటింగ్లో ఉన్నారు. ఈక్రమంలోనే వారి డేటింగ్ ఇప్పుడు మ్యారేజ్‌గా మారబోతోంది.
- జుకోవా రష్యా నుంచి అమెరికాకు వలస వచ్చారు.
- గతంలో జుకోవాకు రష్యాకు చెందిన ఆయిల్ బిలియనీర్ అలెగ్జాండర్‌తో పెళ్లయింది. వారికి ఒక కుమార్తె ఉంది.
- మర్దోక్ మొదట ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్‌ను పెళ్లాడారు. 1960వ దశకంలోనే వీరి పెళ్లి బంధం ముగిసిపోయింది.
- జర్నలిస్ట్ అన్నా మరియా మన్తో రెండోపెళ్లి.. చైనా వ్యాపారవేత్త విన్‌డీ డెంగ్‌తో మూడో పెళ్లి.. అమెరికా మోడల్ జెర్రీ హాల్‌తో నాలుగో పెళ్లి చేసుకున్నారు. వాళ్లందరికీ మర్దోక్ విడాకులు ఇచ్చేశారు.
- తన రెండో భార్య నుంచి విడిపోయిన సందర్భంలో మర్దోక్ రికార్డు స్థాయిలో రూ.14వేల కోట్ల భరణం చెల్లించారు.
Also Read : Car Wash – 5000 Fine : ఆ సిటీలో కారు కడిగితే రూ.5 వేల ఫైన్.. కొత్త రూల్
- 1950వ దశకంలో మీడియాలో కెరీర్‌ను ఆరంభించిన మర్దోక్.. న్యూస్ ఆఫ్ ది వరల్డ్, ది సన్ వార్తా పత్రికలను ప్రారంభించారు.
- అనంతర కాలంలో ఆయన ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు వచ్చి సెటిల్ అయ్యారు.
- అమెరికాలోని న్యూయార్క్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్‌లను మర్దోక్ కొనేశారు.
- 1996లో ఫాక్స్ న్యూస్‌ను మర్దోక్ ప్రారంభించారు.
- 2013లో న్యూస్‌కార్ప్‌ను స్థాపించారు.
- 2011 సంవత్సరంలో ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం కారణంగా న్యూస్ ఆఫ్ ది వరల్డ్ పత్రికను ఆయన మూసేశారు.
- గతేడాది సెప్టెంబరులోనే మర్దోక్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కుమారులకు అప్పగించారు.
Also Read :Flight Tire Fall : నడి ఆకాశంలో ఊడిన విమానం టైరు.. ఏమైందంటే ?
Related News
Rupert Murdoch: 92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకోనున్న రూపర్ట్ మర్డోక్
మీడియా మొగల్ గా పేరుగాంచిన రూపర్ట్ మర్డోక్ (Rupert Murdoch) తన 92వ ఏట పెళ్లి చేసుకోబోతున్నాడు. బిలియనీర్ వ్యాపారవేత్త మాజీ పోలీసు కెప్టెన్ ఆన్ లెస్లీ స్మిత్ (66)తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించారు.