Pregnancy Age: ఈ వయసు దాటితే పిల్లలు పుట్టడం కష్టమే.. మహిళలు పూర్తి వివరాలు తెలుసుకోండిలా!
స్త్రీలకు తల్లి కావడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. మాతృత్వం అంటే స్త్రీలకు మరొక జన్మ అని చెప్పవచ్చు. అయితే
- By Nakshatra Published Date - 09:30 AM, Sun - 21 August 22
స్త్రీలకు తల్లి కావడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. మాతృత్వం అంటే స్త్రీలకు మరొక జన్మ అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుత జనరేషన్ లో చాలామంది అనేక రకాల కారణాల వల్ల తల్లి అయ్యే అదృష్టాన్ని భాగ్యాన్ని కోల్పోతున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలి అంతే మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లే దానికి ముఖ్య కారణం అని అంటున్నారు నిపుణులు. అయితే కొంతమంది స్త్రీలు తల్లి అవ్వడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుండగా ఇంకొందరు మాత్రం, లైఫ్ నీ ఎంజాయ్ చేయడం కోసం ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తున్నారు.
మన చుట్టూ ఉన్న సమాజంలో 20 ఏళ్ల దాడిన తర్వాత వెంటనే పెళ్లి చేసుకొని 35 ఏళ్లు వచ్చినా కూడా ఇప్పటికీ తల్లులు కానీ స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఇకపోతే 35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చితే ప్రమాదం ఉంది అని చాలామంది మహిళలు భావిస్తున్నారు. మరి నిజంగానే 35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చితే ప్రమాదం వస్తుందా? మహిళలు ఏ వయసులో సంతానం కోసం ప్రయత్నించాలి ఇటువంటి ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పెళ్లి అయిన తర్వాత రెండు మూడు నెలలకి చాలామంది మహిళలు పిల్లలు కాలేదు అని డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. కానీ పెళ్లి అయిన తర్వాత సంవత్సరం వరకు చూసి సంవత్సరం అయిన తర్వాత కూడా పిల్లలు కలగకపోతే అప్పుడు డాక్టర్ ని సంప్రదించాలట. అయితే సాధారణంగా మహిళలు తొందరగా గర్భం దాల్చే వయసు 25 నుంచి 30 ఏళ్ల లోపు. కానీ ప్రస్తుతం మహిళలు కెరియర్, ప్రాబ్లమ్స్ అంటూ మూడు పదుల వయసు దాటిన తర్వాత కూడా పెళ్లి చేసుకుంటే వారు చాలామంది ఉన్నారు. ఇలా చేయడం కూడా మహిళలకు మాతృత్వం కాకపోవడానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. మహిళలు తల్లి కాకపోవడానికి ప్రధాన సమస్య వయస్సు. అయితే కేవలం ఇవే కాకుండా మహిళ మాతృత్వాన్ని పొందకపోవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం..
Related News
Free Bus : సీటు కోసం బస్సులో కొట్టుకున్న మగవారు
తొర్రూర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్న బస్సులో భర్తలు తమ భార్యలకు సీటు కోసం కర్చీఫ్ వేశారు