Life Partner: సారీ చెప్తే సరిపోదు…ఇలా చేస్తేనే మనసులో బాధ తీరుతుంది.!!
కొందరు జీవిత భాగస్వామి మనస్సు నొచ్చేలా ప్రవర్తిస్తుంటారు. తర్వాత సారీ చెప్పి బాధ్యత తీరిపోయిందనుకుంటారు.
- Author : Hashtag U
Date : 30-04-2022 - 5:20 IST
Published By : Hashtagu Telugu Desk
కొందరు జీవిత భాగస్వామి మనస్సు నొచ్చేలా ప్రవర్తిస్తుంటారు. తర్వాత సారీ చెప్పి బాధ్యత తీరిపోయిందనుకుంటారు. ఎదుటివారి మనసులో బాధ తగ్గిందా లేదా అనేది కూడా పట్టించుకోరు. ఇలాంటి క్షమాపణలు దంపతుల మధ్య మరింత దూరాన్ని పెంచుతాయి తప్పా తగ్గించవు. కాబట్టి మనస్పూర్తిగా సారీ చెప్పి వారిని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయమంటున్నారు మానసిక నిపుణులు.
భాగస్వామిని బాధపెట్టి సరైన రీతిలో క్షమించమని అడగపోతే ఎలాంటి ఉంటుంది. ఎదుటివారు ఎలా బాధపడుతారో అనే ఆలోచన ఉండలి. ఇలా చేస్తే వారి వేదన మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మీ విచారాన్ని నెమ్మదిగా ప్రేమగా మాటల్లో వ్యక్తం చేయాలి. మీరు చెప్పిన సంజాయిషీ వినగానే వారి మనసులోని బాధ అమాంతం అవిరైపోతుందని అనుకోవద్దు. వారి కోపం తగ్గించడానికి ఓపికగా కూడా చాలా అవసరం. ఓపికగా ప్రయత్నించాలి.
కొందరు జీవిత భాగస్వామిని అవమానపరుస్తుంటారు…కించపరుస్తుంటారు. లేదా మాటలతో మనస్సు నొచ్చేలా ప్రవర్తిస్తుంటారు. కోపం తగ్గాక నోరు జారిన విషయం అర్థంకాదు. తీరా అంగీకరించేందుకు మనసు ఒప్పుకోదు. ఇలాంటి అహం బంధానికి అస్సలు మంచిది కాదు. తప్పు అనిపిస్తే…ఒప్పుకోవాలి. పూర్తి బాధ్యతను తీసుకోవాలి. మరోసారి ఇలా జరగదన్న భరోసాను కల్పించాలి. ఇలాంటి ప్రవర్తన ఎదుటివారిలో క్రమేపీ మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎదుటివారి మనస్సు గెలవడానికి పశ్చాత్తాపాన్ని ప్రదర్శించడం కాదు..ఏర్పడిన దూరాన్నీ తగ్గించుకునే ప్రయత్నం నిజాయతీగా చేయాలి.
ఇక అభ్యర్థించడం…క్షమాపణ చెప్పడంలోనూ పారదర్శకత కనిపించాలి. అలా కాకుండా కాసేపు ఒంటరిగా ఉన్నా చాలు…కోపం అదే తగ్గిపోతుందని అనుకోవద్దు. తన భావోద్వేగాలపై పట్టింపు లేదనో, నిర్లక్ష్యమనో భావించే ప్రమాదం కూడా ఉంటుంది. కాస్త ఓపికగా జరిగిన దాని గురించి ప్రశాంతంగా చర్చించుకోవాలి. ఇలా చేస్తే ఇద్దరి మనసులూ తేలికవుతాయి.
అభ్యర్థించడంలో… క్షమాపణలో పారదర్శకత కనిపించాలి. అలాకాకుండా కాసేపు ఒంటరిగా ఉంటే చాలు.. కోపం అదే పోతుంది అని ఆలోచించొద్దు. తన భావోద్వేగాలపై పట్టింపు లేదనో, నిర్లక్ష్యమనో భావించే ప్రమాదం ఉంది. కాస్త ఓపికగా జరిగిన దాని గురించి ప్రశాంతంగా చర్చించుకుంటే చాలు. ఇరువురి మనసులూ తేలికవుతాయి.