Weightgaining Reasons: ఎన్ని వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం లేదా ? ఇవే కారణం కావొచ్చు..
సరైన డైట్ చేస్తూ.. వ్యాయామం క్రమంగా చేస్తున్నా బరువు తగ్గడం లేదనిపిస్తే.. దాని అర్థం మీరు సప్లిమెంట్స్ ను తీసుకుంటున్నారని. ఇలా బరువు తగ్గకపోగా.. పెరగవచ్చు.
- By News Desk Published Date - 09:11 PM, Mon - 8 January 24
Weightgaining Reasons: మనిషికి అందం ఉన్నా లేకపోయినా.. మంచి శరీర ఆకృతి ఉంటే.. ఆరోగ్యంగా ఉంటాం. శరీరాకృతి బాగుంటే.. అందంగా ఉండాలనిపిస్తుంది. అయితే.. శరీర బరువు ఎక్కువగా ఉన్నవారు ఆహారం మితంగా తీసుకోవడంతో పాటు గంటల తరబడి వర్కవుట్స్ చేస్తారు. చెమటొచ్చేలా వ్యాయామం చేస్తూ ఉంటే.. శరీరం బిగుతుగా ఉంటుంది. వర్కవుట్స్ చేస్తున్నా.. మీరు బరువు పెరుగుతున్నారా ? ఇందుకు కొన్ని కారణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వర్కవుట్స్ చేసినపుడు గట్టి కండరాలను పొందే అవకాశం ఉంటుంది. ఇదంతా మీరు తినే ఆహారం, చేసే వ్యాయామంపై ఆధారపడి ఉంటుంది. వర్కవుట్స్ చేసినపుడు తగిన మొత్తం ప్రొటీన్ ను తీసుకోవాలి. ప్రొటీన్ కండరాల ద్రవ్యరాశిని పెంచుతుంది. అలాంటి పరిస్థితుల్లో బరువును చూసుకున్నపుడు తగ్గడానికి బదులుగా పెరిగినట్లు కనిపిస్తుంది. చాలామంది ప్రొటీన్ తో పాటు ఇతర ఆహార పదార్థాలను కూడా తీసుకుంటారు. కొందరు వర్కవుట్స్ చేసినా.. ఆహార నియమాలను సరిగ్గా పాటించకపోవడం వల్ల కూడా బరువు తగ్గినట్లు అనిపించదు.
సరైన డైట్ చేస్తూ.. వ్యాయామం క్రమంగా చేస్తున్నా బరువు తగ్గడం లేదనిపిస్తే.. దాని అర్థం మీరు సప్లిమెంట్స్ ను తీసుకుంటున్నారని. ఇలా బరువు తగ్గకపోగా.. పెరగవచ్చు. అథ్లెట్స్ లో చాలామంది వ్యాయామం తర్వాత కార్బోహైడ్రేట్లను కలిగి ఉన్న సప్లిమెంట్లను తీసుకుంటారు. పిండి పదార్థాలు కండరాల్లో గ్లైకోజెన్ తో నీటిని పునరుద్ధరించడానికి సహాయపడుతాయి. ఇది సాధారణంగా జరిగే ఆరోగ్యకరమైన రికవరీ ప్రక్రియ. అయితే.. మీ సొంతంగా ఎలాంటి సప్లిమెంట్ తీసుకోవడం మంచిది కాదు.
వ్యాయామం చేసేటపుడు శరీరం నుంచి ఎంత చెమట వస్తే అంత మంచిది. లేనిపక్షంలో బరువు తగ్గరు. శరీరంలో నీరు చెమట రూపంలో నీరు బయటకు రాకపోతే.. ఎంత బరువున్నారో అంతే ఉంటారు. చాలాసార్లు వర్కవుట్స్ చేసినా.. అవసరానికి మించి తింటాం. వర్కవుట్ చేయడంతో కేలరీలు కరిగిపోయాయని అనుకుని.. కాస్త ఎక్కువ తింటాం. దీనివల్ల ప్రయోజనం ఉండదు. మనం కరిగించే దానికంటే.. ఎక్కువ కేలరీలు తీసుకోవడం అంతమంచిది కాదు. వేయించిన ఫుడ్స్, స్నాక్స్ కు బదులుగా పండ్లు, కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలి.
Related News
Weightloss Tips : ఈ చిట్కాలు పాటిస్తే.. నెలకు 5 కేజీలు తగ్గుతారు..
అతిగా ఆహారాన్ని తినడం తగ్గించుకోవాలి. తినే ప్లేటు కూడా మన తిండిని, ఆకలిని ప్రభావితం చేస్తుంది. పెద్దప్లేటులో తక్కువ ఆహారం తింటే.. ఇంకా తినాలనిపిస్తుంది, చిన్న ప్లేటులో తింటే..