Ullipaya Pulusu: ఎప్పుడైనా ఉల్లిపాయ పులుసు తిన్నారా.. అయితే ట్రై చేయండిలా?
మామూలుగా చాలా వంటకాలలో ఉల్లిపాయను ఉపయోగిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఉల్లిపాయ లేకుండా చాలా వరకు కర్రీ కూడా తయారు అవ్వదు. ఉల్లిపాయ
- By Anshu Published Date - 08:40 PM, Tue - 5 September 23

మామూలుగా చాలా వంటకాలలో ఉల్లిపాయను ఉపయోగిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఉల్లిపాయ లేకుండా చాలా వరకు కర్రీ కూడా తయారు అవ్వదు. ఉల్లిపాయను వంటల్లో మాత్రమే కాకుండా పచ్చిగా కూడా చాలామంది తింటూ ఉంటారు. కేవలం ఉల్లిపాయతో చేసే వంటలు చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు. అటువంటి వాటిలో ఉల్లిపాయ పులుసు కూడా ఒకటి. వినడానికి కాస్త వెరైటీగా ఉన్న ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఉల్లిపాయ పులుసుకు కావలసిన పదార్ధాలు:
ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు
చింతపండు రసం – పావు కప్పు
బెల్లం – కొద్దిగా
పచ్చి మిర్చి – 1
బియ్యం పిండి – 1/2 చెంచా
ఉప్పు – 1/2 చెంచా
కారం – 1/2 చెంచా
మెంతిపొడి – 1/4 చెంచా
ఆవాలు – సరిపడా
మెంతులు – సరిపడా
జీలకర్ర – సరిపడా ఎండుమిరపకాయలు – సరిపడా
కరివేపాకు – సరిపడా
నూనె – తగినంత
ఉల్లిపాయ పులుసు తయారీ విధానం :
ముందుగా మూకుడలో నూనెవేసి పోపుగింజలు, ఎండుమిరపకాయలు వేయ్యాలి. అవి వేగాక కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి చింతపండు రసం కొద్దిగా నీరు కలిపి పులుసు లాగా చేసి చిన్న మంటపై మరిగించాలి. ఉల్లి ముక్కలు ఉడికాక పసుపు, ఉప్పు, కారం, మెంతి పిండి వేసి బెల్లం జోడించి మరికొద్దిగా పులుసు ఉడికాక కొద్దిగా బియ్యం పిండి నీటిలో కలిపి అది పులుసులో వేసి స్టౌవ్ ఆఫ్ చెయ్యాలి. అంతే ఉల్లిపాయ పులుసు రెడీ.